Telugu Global
Andhra Pradesh

పాదయాత్ర ఇలా ఎంతకాలం సాగుతుంది?

చంద్రబాబు సొంత జిల్లాలోనే కొడుకు పాదయాత్ర ఇంత అధ్వాన్నంగా జరుగుతుంటే ముందు ముందు ఇంకెత ఘోరంగా ఉంటుందో అనే టెన్షన్ తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది.

పాదయాత్ర ఇలా ఎంతకాలం సాగుతుంది?
X

ప్రజాద‌రణ లేని రాజకీయ పార్టీల మనుగడ కష్టమే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే ఆందోళనల్లో జనాలే కనబడకపోతే ఇక ఆందోళనలు ఎవరి కోసం చేస్తున్నట్లు? ఈ ఆందోళనలు రకరకాలుగా ఉంటాయి. ఇందులో పాదయాత్ర కూడా ఒకటి. ప్రత్యక్షంగా ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ వారి బాధలను, సమస్యలను ప్రత్యక్షంగా చూడటమే పాదయాత్ర ముఖ్యొద్దేశం. వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు సక్సెస్ అయ్యాయంటే వారితో జనాలు మమేకమైన విధానమే కారణం.

మరి అలాంటి సీన్ ప్రస్తుతం టీడీపీ యువరాజు నారా లోకేష్ పాదయాత్ర యువగళంలో కనిపిస్తుందా? అస్సల్లేదనే సమాధానం వినిపిస్తోంది. చిత్తూరులో నిర్వహించిన బహిరంగసభలో జనాలు కనిపించలేదంటేనే పాదయాత్ర ఎలా సాగుతోందో అర్థ‌మైపోతోంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే కొడుకు పాదయాత్ర ఇంత అధ్వాన్నంగా జరుగుతుంటే ముందు ముందు ఇంకెత ఘోరంగా ఉంటుందో అనే టెన్షన్ తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. పాదయాత్రతో పాటు బహిరంగసభ కూడా ఫెయిలవ్వటంతో చంద్రబాబు స్థానిక నేతలపై తీవస్థాయిలో మండిపోయినట్లు సమాచారం.

ఏ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా అది జనాల్లో మైలేజీ వచ్చేలా ఉండాలి. కానీ ప్రస్తుత లోకేష్ పాదయాత్రతో టీడీపీ బాగా డ్యామేజ్ అవుతోంది. పాదయాత్రలో లోకేష్ మాటలను, హాజరవుతున్న జనాలకు సంబంధించిన ఆడియో, వీడియోలను వైసీపీ నేతలు, సోషల్ మీడియానే బాగా వైరల్ చేస్తోందంటేనే పరిస్థితి అర్థ‌మైపోతోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే జనాద‌రణలేని పాదయాత్రను కంటిన్యూ చేయటం ఎలా? ఎంతకాలం పాదయాత్ర చేయగలరు? అన్నదే. రోజులు గడిచే కొద్దీ పాదయాత్రపై నెగిటివ్ ప్రచారం పెరిగిపోతోంది.

పాదయాత్ర ఫెయిలైందని చెప్పటానికి రెండు ఉదాహరణలున్నాయి. మొదటిదేమో పాదయాత్రకు సంబందించిన వార్తలు, ఫొటోలను ఎల్లో మీడియా లోపలిపేజీలకు పరిమితం చేసేసింది. అలాగే జనసమీకరణ విషయంలో తమ్ముళ్ళపై చంద్రబాబు మండిపోవటం. పాదయాత్రలో పాల్గొనేందుకు జనాలు ఆసక్తి చూపకపోతే పాపం తమ్ముళ్ళు మాత్రం ఏం చేస్తారు? 2014-19 మధ్య చంద్రబాబు పాలన జనాలందరికీ ఇంకా గుర్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని లోకేష్ చెబుతుంటే జనాలు ఎలా నమ్ముతారు? ఇందుకనే పాదయాత్ర ఫెయిలైందేమో.

First Published:  9 Feb 2023 6:27 AM GMT
Next Story