Telugu Global
Andhra Pradesh

మూడేళ్లలో ఏపీ అప్పు లక్షా 15వేల కోట్లే

ఈ ఏడాది తొలి 9 నెలలకు గాను ఏపీ రుణ పరిమితిని 43.8 వేల కోట్ల రూపాయలుగా కేంద్రం నిర్ధారించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

మూడేళ్లలో ఏపీ అప్పు లక్షా 15వేల కోట్లే
X

ఏపీ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో చేసిన అప్పు లక్షా 15వేల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విభజన నాటికి ఏపీ వాటా అప్పు 97.12 వేల కోట్లు అని కేంద్ర మంత్రి వివరించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ఐదేళ్లలో 96.45 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని పంకజ్ వివరించారు.

మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం లక్షా 15వేల కోట్ల రూపాయల బహిరంగ అప్పుతో పాటు కార్పొరేషన్ల ద్వారా కూడా రుణాలు సమీకరించిందని.. ఆ అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది తొలి మూడు నెలల్లో ఏపీ ప్రభుత్వం 23.3వేల కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్‌లో రుణాలుగా తీసుకుందని.. ఈ ఏడాది తొలి 9 నెలలకు గాను ఏపీ రుణ పరిమితిని 43.8 వేల కోట్ల రూపాయలుగా కేంద్రం నిర్ధారించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఇప్పటికే 23వేల 300 కోట్ల రూపాయలను ఏపీ అప్పుగా తీసుకుందన్నారు.

2015-16లో ఏపీ ప్రభుత్వం రూ. 15, 237 కోట్లు, 2016-17లో 25,145 కోట్లు, 2017-18లో 18.982 కోట్లు, 2018-19లో 24.706 కోట్ల రూపాయల అప్పు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019-20లో 33.06 వేల కోట్లు, 2020-21లో 43వేల 700 కోట్లు, 2021-22లో 39వేల 84 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించారు.

First Published:  27 July 2022 2:36 AM GMT
Next Story