Telugu Global
Andhra Pradesh

ఉండి టికెట్ రఘురామరాజుకి.. టీడీపీలో రచ్చ రచ్చ

ప్రజాగళం యాత్రలో ఉన్న చంద్రబాబు పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుని ప్రకటించారు.

ఉండి టికెట్ రఘురామరాజుకి.. టీడీపీలో రచ్చ రచ్చ
X

ఉండి నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. 2019లో ఫ్యాన్ హవాని కూడా తట్టుకుని అక్కడ టీడీపీ పరువు నిలిపారు ఎమ్మెల్యే మంతెన రామరాజు. ఈసారి కూడా ఆయనకే టికెట్ ఖాయమైంది. కానీ మధ్యలో చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు. రామరాజు టికెట్ ని కాస్తా రఘురామకృష్ణంరాజుకి కట్టబెడుతున్నట్టు ప్రకటించారు. సడన్ షాక్ తో ఎమ్మెల్యే రామరాజు మైండ్ బ్లాంక్ అయింది. ఆయన అనుచరులు చంద్రబాబుని చెడామడా తిడుతున్నారు. పాలకొల్లు పార్టీ మీటింగ్ లో రచ్చ మొదలైంది.

రఘురామ కృష్ణంరాజుని కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేయాలనుకున్నారు చంద్రబాబు. చివరకు అలానే చేశారు. బీజేపీ లిస్ట్ లో పేరుంటుందని అనుకున్నా కుదర్లేదు. దీంతో రఘురామ ఇంటర్వ్యూలివ్వడం మొదలు పెట్టారు. తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చంద్రబాబు పోలవరం కడతానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. దీంతో బాబులో కలవరం మొదలైంది. రఘురామకృష్ణంరాజుని అలా వదిలేస్తే తన పరువు తీసేస్తారనే భయం ఏర్పడింది. సడన్ గా ఆయన్ను నిన్న పార్టీలో చేర్చుకున్నారు. ఈరోజు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేశారు.

ప్రజాగళం యాత్రలో ఉన్న చంద్రబాబు పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఉండి నియోజకవర్గ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుని ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు షాకయ్యారు. ఆయన వర్గం అక్కడే ఆందోళనకు దిగింది. కానీ చంద్రబాబు మాత్రం వారి నిరసనలు పట్టించుకోవడంలేదు. రఘురామకు ఆ టికెట్ ఖాయం చేశామని తెగేసి చెప్పారు. నమ్మించి గొంంతుకోయడం చంద్రబాబుకి అలవాటే. కానీ ఇక్కడ ఎమ్మెల్యే రామరాజు ఊహించని పరిణామం జరిగింది. రఘురామరాజుకోసం తనని బలిచేయడం కరెక్ట్ కాదంటున్నారాయన. 2019లో తాను ఇక్కడ్నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామకు టికెట్ ఇస్తే ఉండి సీటుపై టీడీపీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు.

First Published:  6 April 2024 8:23 AM GMT
Next Story