Telugu Global
Andhra Pradesh

తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు.. టీటీడీ హెచ్చరికలు

మెట్ల మార్గంలో అడవి జంతువుల కదలికలను నియంత్రించేందుకు కంచె ఏర్పాటు విషయంలో ఇంకా అటవీశాఖ నివేదికలు రాలేదని తెలిపారు ఈవో ధర్మారెడ్డి. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే దానిపై చర్యలు తీసుకుంటామన్నారు.

తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు.. టీటీడీ హెచ్చరికలు
X

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సోషల్ మీడియాలో ఇటీవల పలు వదంతలు వ్యాప్తి చేస్తున్నారని, అన్నీ నిజాలే అన్నట్టుగా భ్రమ కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలకు సంబంధించి అధికారిక సమాచారం ఉంటే తామే చెబుతామని.. సోషల్ మీడియాలో రీల్స్, ఇతరత్రా వీడియోల పేరుతో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

కంచె నిర్మాణంపై..

మెట్ల మార్గంలో అడవి జంతువుల కదలికలను నియంత్రించేందుకు కంచె ఏర్పాటు విషయంలో ఇంకా అటవీశాఖ నివేదికలు రాలేదని తెలిపారు ఈవో ధర్మారెడ్డి. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, సీసీ కెమెరాలు,ట్రాప్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. నడకదారిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్న పిల్లలను అనుమతించే విషయంలో కూడా ఎలాంటి వెసులుబాట్లు లేవని తెలిపారు. ఘాట్ రోడ్డులో బైక్ ల రాకపోకలపై మాత్రం నిబంధనలు సడలించామని, రాత్రి 10 గంటల వరకు బైక్ లను అనుమతిస్తున్నామని చెప్పారు.

అలిపిరి మెట్ల మార్గం మొదట్లో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు ఈవో ధర్మారెడ్డి. కుడి వైపు ఉన్న రాతి మండపం శిథిలావస్థకు చేరిందని, దాని రాళ్లను సరిచేసి పునర్నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. పార్వేట మండపం కూల్చివేసి పునర్నిర్మిస్తున్నామని, దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈవో. 20 పిల్లర్లతో యధావిధిగా పార్వేట మండపాన్ని తిరిగి నిర్మిస్తున్నామని చెప్పారు.

First Published:  4 Oct 2023 5:38 AM GMT
Next Story