Telugu Global
Andhra Pradesh

సింక్ లో గ్లాస్.. నాగబాబు రియాక్షన్

'గ్లాస్' సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుందని చెప్పుకొచ్చారు నాగబాబు. కానీ 'ఫ్యాన్' రెక్కలు విరిగితే మాత్రం విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వలేదన్నారు.

సింక్ లో గ్లాస్.. నాగబాబు రియాక్షన్
X

ఎన్నికల వేళ 'సిద్ధం' సభల్లో సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్, ఇంటి బయట సైకిల్, సింక్ లో గ్లాస్ అనే డైలాగ్ బాగా పాపులర్ అవుతోంది. దీనికి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ, జనసేన కూడా ఆపసోపాలు పడుతున్నాయి. జనసేన నుంచి నాగబాబు లైన్లోకి వచ్చారు. సింక్ లో గ్లాస్ అంటూ జనసేన గుర్తుని వెటకారం చేస్తారా..? అని చిన్నబుచ్చుకున్నారు. పంచ్ లు, ప్రాసలపై పెట్టిన శ్రద్ధ ప్రజా పాలనపై పెట్టాలంటూ ట్విట్టర్లో తన ఆగ్రహం వెళ్లగక్కారు.


'గ్లాస్' సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుందని చెప్పుకొచ్చారు నాగబాబు. కానీ 'ఫ్యాన్' రెక్కలు విరిగితే మాత్రం విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వలేదన్నారు. పబ్లిక్ మీటింగ్స్ లో ప్రాసలు, పంచ్ లపై పెట్టిన శ్రద్ధ లో సగం 'ప్రజాపరిపాలన' పెట్టాలి సారూ అంటూ కౌంటర్ ఇచ్చారు.

నాగబాబుపై ట్రోలింగ్..

సీఎం జగన్ డైలాగ్ పై నాగబాబు స్పందించకుండా ఉన్నా సరిపోయేది. అనవసరంగా జగన్ కి కౌంటర్ ఇచ్చి ఇరుకున పడ్డట్టయింది. నాగబాబు ట్వీట్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఆయన సైకిల్ ని కిందపడేసి తొక్కాలంటూ చేసిన వీడియోని మళ్లీ తెరపైకి తెచ్చారు. మహా నటుడు అంటూ నాగబాబుని వెటకారం చేస్తున్నారు. మీరు ప్యాకేజీ మీద పెట్టిన శ్రద్ధ జనసేన పార్టీపై పెట్టుంటే కనీసం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అయి ఉండేవాడంటూ ఆటాడేసుకుంటున్నారు. ఫ్యాన్ రెక్కలు విరిగినా, ఇంకేమయినా రిపేర్ చేసుకోవచ్చని, గ్లాసు పగిలితే మాత్రం పనికి రాదని నెటిజన్లు నాగబాబుకి కౌంటర్లిచ్చారు.

First Published:  19 Feb 2024 1:19 PM GMT
Next Story