Telugu Global
Telangana

Naga Shaurya: వారం రోజుల్లో పెళ్లి.. కళ్లు తిరిగి పడిపోయిన తెలుగు హీరో

Naga Shaurya health condition: తాజాగా లక్ష్య అనే సినిమా షూటింగ్ లో హీరో నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయాడు. ఆయన్ను వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

Naga Shaurya: వారం రోజుల్లో పెళ్లి.. కళ్లు తిరిగి పడిపోయిన తెలుగు హీరో
X

Naga Shaurya: వారం రోజుల్లో పెళ్లి.. కళ్లు తిరిగి పడిపోయిన తెలుగు హీరో

తెలుగు యువహీరో నాగశౌర్యకు వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బెంగళూరుకి చెందిన అనూష శెట్టితో ఆయనకు ఈనెల 20వ తేదీ ఉదయం 11:25 గంటలకు వివాహ మహూర్తం ఫిక్స్ అయింది. పెళ్లి టైమ్ దగ్గరపడే సరికి నాగశౌర్య షూటింగ్ స్టేజ్ లో ఉన్న సినిమాలను చకచకా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడని తెలిసింది. తాజాగా లక్ష్య అనే సినిమా షూటింగ్ లో నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయాడు. ఆయన్ను వెంటనే హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

సిక్స్ ప్యాక్, ఆహార నియమాల పేరుతో సినిమా హీరోలు ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారనడంలో సందేహం లేదు. పర్సనల్ ట్రైనర్లు, పర్సనల్ న్యూట్రిషనిస్ట్ లను నియమించుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టక మానవు. ఫిజికల్ ఫిట్ నెస్ పై శ్రద్ధ ఉన్న నటులు ఇటీవల జిమ్ చేస్తూ ఒత్తిడికి లోనై చనిపోయిన ఉదాహరణలున్నాయి. తాజాగా తెలుగు హీరో నాగశౌర్య షూటింగ్ స్పాట్ లోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.

Advertisement

లక్ష్య సినిమాలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాల్సి ఉంది. దీనికోసం ఆయన చాన్నాళ్లుగా అదే ఫిజిక్ మెయింటెన్ చేస్తున్నాడు. సినిమా పూర్తయితే ఆయన కాస్త రిలాక్స్ కావొచ్చు. అందుకే పెళ్లికి ముందే సినిమా షూటింగ్ పూర్తి చేయడం కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడని తెలిసింది. పైగా సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేయడం కోసం ఆహార నియమాలు పాటిస్తుండటంతో ఆయన నీరసంగా కనిపిస్తున్నాడట. ఈరోజు షూటింగ్ స్పాట్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా హీరో కుప్పకూలాడు. దీంతో సినిమా యూనిట్ కంగారుపడింది. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే నాగశౌర్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ లేవని, కేవలం నీరసంతో కళ్లు తిరిగి పడిపోయాడని అంటున్నారు వైద్యులు. త్వరగానే ఆయన కోలుకుంటాడని చెప్పారు. అయితే పెళ్లి వారం రోజుల్లో ఉండగా హీరో ఇలా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. షూటింగ్ కొన్నిరోజులు ఆపేయాలని, పెళ్లి తర్వాత తిరిగి సెట్స్ పైకి వెళ్లాలని చెబుతున్నారట.

Next Story