Telugu Global
Andhra Pradesh

తిరుపతి: కారు ఢీకొని రెండు ముక్కలైన ట్రాక్టర్

తిరుపతిలోని చంద్రగిరి బైపాస్ వద్ద ఓ ట్రాక్టర్ బెంజ్ కార్ ను ఢీ కొని రె‍ండు ముక్కలైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తిరుపతి: కారు ఢీకొని రెండు ముక్కలైన ట్రాక్టర్
X

కారు ఢీ కొని ట్రాక్టర్ రెండు ముక్కలవడమేంటని ఆశ్చర్యంగా ఉంది కదా1 కానీ ఇది నిజం. తిరుపతిలోని చంద్రగిరి బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

ఓ ట్రాక్టర్ రాంగ్ రూట్ లో వచ్చి అటు వైపు నుంచి వస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొంది. దాంతో ట్రాక్టర్ ఒక్కసారిగా రెండుముక్కలై చెరో వైపు పడిపోయింది. కారు ముందుది భాగం దెబ్బ తింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ ట్రాక్టర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. ట్రాక్టర్ కన్నా మెర్సిడెస్ బెంజ్ కారు దృడమైనదని దీనితో రుజువయ్యిందని నెటిజనులు అంటున్నారు.

First Published:  27 Sep 2022 6:04 AM GMT
Next Story