Telugu Global
Andhra Pradesh

వడ్డికాసులవాడి ఖజానా.. 13వ నెల కూడా రికార్డ్ బ్రేక్

గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే గత 13 నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ ను దాటుతూ వస్తోంది. గతేడాది ఆగస్టు నెలలో అత్యధికంగా రూ. 140.34 కోట్ల ఆదాయం శ్రీవారికి హుండీ ద్వారా లభించింది.

వడ్డికాసులవాడి ఖజానా.. 13వ నెల కూడా రికార్డ్ బ్రేక్
X

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సగటున నెలకి రూ.100కోట్లు. కరోనాకి ముందు కొన్ని నెలలు మాత్రమే హుండీ ఆదాయం 100కోట్లు దాటేది. కానీ కరోనా తర్వాత వడ్డికాసులవాడి ఖజానా కళకళలాడుతోంది. నెలకి కచ్చితంగా 100కోట్లకు పైగా కానుకలు వస్తున్నాయి. మార్చి నెల కూడా వందకోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు టీటీడీ లెక్కలు చెబుతోంది. మార్చిలో 120.29 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. వరుసగా 13 నెలలు హుండీ ఆదాయం 100కోట్ల మార్క్ దాటినట్టు తెలిపారు అధికారులు.

కరోనా సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం దూరం కాగా, ఆ తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో.. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. భక్తుల రద్దీకి తగ్గట్టే శ్రీవారి ఆదాయం కూడా పెరుగుతోంది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే గత 13 నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ ను దాటుతూ వస్తోంది. గతేడాది ఆగస్టు నెలలో అత్యధికంగా రూ. 140.34 కోట్ల ఆదాయం శ్రీవారికి హుండీ ద్వారా లభించింది.

ఆర్థిక సంవత్సరంలో అత్యథిక ఆదాయం..

గతంలో ఎప్పుడూ లేనంతగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో హుండీ కానులక ద్వారా టీటీడీకి రూ.1,520.29 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి హుండీ ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో హుండీ ఆదాయం లభించలేదు. కరోనా తర్వాత భక్తుల తాకిడి పెరిగింది, దానికి అనుగుణంగానే హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది.

First Published:  1 April 2023 4:13 AM GMT
Next Story