Telugu Global
Andhra Pradesh

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం

టెంపోలో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం
X

తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులోని 6వ మలుపు వద్ద టెంపో ట్రావెలర్ వాహనానికి బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొని బోల్తా పడింది. టెంపోలో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితులు కర్నాటక రాష్ట్రం,‌ బంగారు పేటకు చేందిన వారుగా గుర్తించారు. మరోవైపు ఇదేరోజు 12వ కిలో మీటర్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మహిళలకు గాయలయ్యాయి. ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఆర్చ్‌ ను ఢీకొంది.

వరుస ప్రమాదాలు..

ఇటీవల తిరుమల ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు 24వ మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందారు. వాహనంలోని మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటన తర్వాత ఇటీవల ఎలక్ట్రిక్ బస్సు బోల్తాపడిన సంఘటన కూడా సంచలనంగా మారింది. ఎలక్ట్రిక్ బస్సు బోల్తా సమయంలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. వరుస ఘటనలతో టీటీడీ అప్రమత్తమైంది. ప్రమాదాలపై విచారణ చేపట్టింది. ఘాట్ రోడ్ లో వాహనాల వేగనియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

First Published:  29 May 2023 8:32 AM GMT
Next Story