Telugu Global
Andhra Pradesh

వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైనవారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట రామకృష్ణ కాలనీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి
X

వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా వెళ్లారు.. బంధుమిత్రులతో కలసి ఉల్లాసంగా గడిపారు.. పెళ్లి వేడుక ముగించుకొని తిరిగి తమ గ్రామానికి బయలుదేరినవారు.. తిరుగు ప్రయాణంలో ఊహించని ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్ట‌డంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైనవారంతా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట రామకృష్ణ కాలనీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కలిసి శ్రీకాకుళం జిల్లా పొందూరులో జరిగే వివాహానికి వ్యానులో బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అక్కిరెడ్డిపాలెం హైవే వద్ద వీరి వ్యాన్‌ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చింతాడ ఇందు (50), హనుమంతు ఆనంద్‌ (40), హనుమంతు చంద్రశేఖర్‌ (16) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  4 April 2024 6:48 AM GMT
Next Story