Telugu Global
Andhra Pradesh

కేజీఎఫ్ హీరో యష్..లోకేష్ భేటీ రహస్యం ఇదే

యష్, లోకేష్ ఇద్దరికీ పరిచయం లేదు. ఒక రాష్ట్రం కాదు. ఒక రంగం కాదు. మరి ఎందుకీ భేటీ జరిగిందని టీడీపీలో కీలకవర్గాలను సంప్రదిస్తే అసలు విషయం బయట పడింది.

కేజీఎఫ్ హీరో యష్..లోకేష్ భేటీ రహస్యం ఇదే
X

కేజీఎఫ్ హీరో యష్, టీడీపీ నేత నారా లోకేష్ కలిసి ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఎవరు ఎవరిని కలిశారు..? ఎందుకు కలిశారు..? అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అధికారికంగా టీడీపీ ఈ భేటీపై ఎటువంటి ప్రకటనలు విడుదల చేయలేదు. అయితే టీడీపీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తమ యువనేత లోకేష్‌, హీరో యష్ ఫొటోలను పోస్టు చేస్తూ సంబరపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా ట్రోల్స్, మీమ్స్ చేస్తూ లోకేష్ తమ టార్గెట్ అని మరోసారి వెల్లడించింది.

యష్, లోకేష్ ఇద్దరికీ పరిచయం లేదు. ఒక రాష్ట్రం కాదు. ఒక రంగం కాదు. మరి ఎందుకీ భేటీ జరిగిందని టీడీపీలో కీలకవర్గాలను సంప్రదిస్తే అసలు విషయం బయట పడింది. తన స్నేహితుడైన ఓ ఎంట్రప్రెన్యూర్ ఆహ్వానం మేరకు బెంగళూరు వెళ్లారు నారా లోకేష్. అయితే ఆ వ్యాపారవేత్త, కేజీయఫ్ హీరో యష్ జిగిరీ దోస్తులు. యష్ స్టార్ డమ్ రాకముందు నుంచే వీరు మంచి స్నేహితులు. లోకేష్ ని తాను కలవడానికి వెళ్తున్నానని, ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడని, వరల్డ్ బ్యాంకులో పనిచేశారని, ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని యష్ కి చెప్పారట. అయితే తానూ వస్తానని ఫ్రెండ్తో కలిసి వచ్చి లోకేష్ ని కలిశారట. ఇంతకుమించి ఈ ఇద్దరి కలయికకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం కానీ, ఇతర అంశాలేవీ లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  16 Dec 2022 6:18 AM GMT
Next Story