Telugu Global
Andhra Pradesh

అమరావతిలో రోడ్లను తవ్వేస్తున్నారు

గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం భారీగా ముళ్లపొదలు విస్తరించాయి.

అమరావతిలో రోడ్లను తవ్వేస్తున్నారు
X

అమరావతిలోని రహదారులకు దొంగల బెడద పట్టుకుంది. రాత్రి వేళ్లలో ఇక్కడి రహదారులను దొంగలు తవ్వేస్తున్నారు. తాజాగా రాష్ట్ర సచివాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డును తవ్వుకెళ్లారు. ఒక చోట 60 అడుగుల మేర, మరో చోట 150 మీటర్ల మేర రోడ్డును ధ్వంసం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం భారీగా ముళ్లపొదలు విస్తరించాయి. దాంతో రాత్రి అయితే చాలు కొందరు వ్యక్తులు.. జేసీబీలు, టిప్పర్లతో వెళ్లి రోడ్లపై తారు పొరను తొలగించి.. దాని కింద ఉండే కంకర, గ్రావెల్‌ను తీసుకెళ్తున్నారు. ఒకటిన్నర అడుగు మేర రోడ్లను తవ్వుతున్నారు.

మందడం, కురగల్లు, యర్రబాలెం ప్రాంతంలో రోడ్లకు దొంగల బెడద అధికంగా ఉందని చెబుతున్నారు. పూర్తిగా నిర్మానుష్య ప్రాంతం కావడంతో అటు వెళ్లే వారు కూడా కరువయ్యారు. దాంతో దొంగల పని ఈజీ అవుతోంది.

First Published:  3 Oct 2022 3:11 AM GMT
Next Story