Telugu Global
Andhra Pradesh

జనసేన, బీజేపీకి చంద్రబాబు ఆఫర్ ఇచ్చిన సీట్లు ఇవే

వచ్చే ఎన్నికల్లో జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చి.. బీజేపీకి అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా 15 ఎంపీ సీట్లను ఇచ్చేలా చంద్రబాబు ఆఫర్ పంపించారని మాజీ మంత్రి పేర్నినాని వివరించారు.

జనసేన, బీజేపీకి చంద్రబాబు ఆఫర్ ఇచ్చిన సీట్లు ఇవే
X

వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే కాకుండా బీజేపీతోనూ కలిసి పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో జనసేనకు 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చి.. బీజేపీకి అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా 15 ఎంపీ సీట్లను ఇచ్చేలా చంద్రబాబు ఆఫర్ పంపించారని వివరించారు.

15 ఎంపీ సీట్లుతో సరిపెట్టుకుందామా లేక 20 సీట్లు అడుగుదామా అని బీజేపీ ఆలోచిస్తోందని నాని చెప్పారు. ఈ డీల్‌కు మధ్యవర్తిత్వం వహిస్తున్నది సుజనా చౌదరే అని పేర్నినాని వివరించారు. తాను అమిత్ షా పక్కన ఉండి అనేక సార్లు టీడీపీని కాపాడానని ఒక ఇంటర్వ్యూలో సుజనా చౌదరే చెప్పారని వెల్లడించారు. సుజనా చౌదరి బీజేపీలోకి చంద్రబాబుకు చెప్పే వెళ్లారని వివరించారు.

2019లో కాయగా మారిన వైసీపీ 2024కు పండుగా మారి కుళ్లిపోతుందని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఐదేళ్లలోనే వైసీపీ పండు కుళ్లిపోతే.. మరి పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కుళ్లి రాలిపోకుండా ఉంటుందా.. మోడీ ప్రభుత్వాన్ని ఏమైనా కోల్డ్ స్టోరేజ్లో పెట్టారా అని పేర్ని నాని ప్రశ్నించారు.

Next Story