Telugu Global
Andhra Pradesh

పిల్లకాకికేం తెలుసు.. జగన్‌ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు ఇవీ..

చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. దానికి మించిన పెట్టుబడులు జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే వచ్చాయి.

పిల్లకాకికేం తెలుసు.. జగన్‌ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు ఇవీ..
X

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో కొత్త పెట్టుడులు రాకపోగా ఉన్నవాటిని తరిమేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. జగన్‌ వైఖరి కారణంగా లులు మాల్‌, ఆదానీ డేటా సెంటర్‌ వెళ్లిపోయాయన్నారు. ఈ మాటలను బట్టి ఆయనకు తెలిసింది జీరో అనేది అర్థమవుతోంది. టీడీపీ, ఎల్లో మీడియా నిత్యం ఇటువంటి అబద్ధాలనే ప్రచారంలో పెడుతున్నాయి. రామ్మోహన్‌ నాయుడు చెప్పిన మాటల్లో ఏ మాత్రం నిజం లేదనేది వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తెచ్చింది. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో వచ్చిన పెట్టుబడులు మొత్తం కేవలం 32 వేల కోట్ల రూపాయలు మాత్రమే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు దాదాపుగా స్తంభించిపోయాయి. అయినా కూడా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రావడం కొనసాగింది. గత ఐదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు కాగితాలకు మాత్రమే పరిమితం కాలేదు, అవి వాస్తవ రూపం దాల్చాయి.

చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. దానికి మించిన పెట్టుబడులు జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే వచ్చాయి. 2019లో రాష్ట్రంలోని 73 ప్రాజెక్టులకు దాదాపు 34 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. అయినప్పటికీ 2020లో దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల‌తో 42 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయి. 2021లో కూడా కరోనా ప్రభావం కనిపించినప్పటికీ దాదాపు 10 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2022లో ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. 46 ప్రాజెక్టులు దాదాపు 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2023 పెట్టుబడులను కూడా లెక్కలోకి తీసుకుంటే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు లక్ష కోట్ల రూపాయలు దాటింది.

జగన్‌ ప్రభుత్వ వ్యూహం వల్ల ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది. రాష్ట్రంలో నాలుగు ఓడరేవులు వేగంగా సిద్ధమవుతున్నాయి. బందరు, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌ వే.. ఈ నాలుగు పోర్టులూ రానున్న కాలంలో భారీ పారిశ్రామిక కేంద్రాలుగా మారుతాయి. ఈ పోర్టుల సమీపంలో వేల ఎకరాల స్థలంలో పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అన్ని రకాల మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్ల చూపు కూడా ఈ పోర్టులపై ఉంది. ఎగుమతి, దిగుమతుల వెసులుబాటుతో పాటు దేశీయ రవాణాకు అవసరమైన వసతులు, ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కారణంగా ప్రపంచవ్యాప్తంగా పోర్టు ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి సక్సెస్‌ఫుల్‌ మోడల్‌గా తయారైంది. రామాయపట్నం పోర్టు ఈ ఏడాదిలోనే వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. మరో రెండేళ్ల లోపే మిగతా పోర్టులు అందుబాటులోకి వస్తాయి.

లులు మాల్‌, ఆదానీ డేటా సెంటర్‌ విషయాల్లో కూడా రామ్మోహన్‌ నాయుడు తప్పులో కాలేశారు. ఏదైనా విషయం మాట్లాడినప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలనే విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. కావాలనే ఆయన ఆ పని చేశారని అర్థమవుతోంది.

First Published:  1 March 2024 3:09 PM GMT
Next Story