Telugu Global
Andhra Pradesh

ప్రాణహాని, దోమలు, చన్నీళ్ళు అంతా అబద్ధాలేనా?

జైలులో ఉండలేకపోతున్నట్లు ఏసీబీ కోర్టు జడ్జితో చంద్రబాబు చెప్పారు కానీ సౌకర్యాల గురించి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదు.

ప్రాణహాని, దోమలు, చన్నీళ్ళు అంతా అబద్ధాలేనా?
X

రాజమండ్రి జైలులో రిమాండు ఖైదీగా ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదముందని భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్‌తో పాటు తమ్ముళ్ళు, మద్దతుదారులు చాలామంది ప్రతిరోజు నానా గోల చేస్తున్నారు. జైలులో దోమల కారణంగా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని, స్నానానికి వేడి నీళ్ళు కూడా ఇవ్వటంలేదంటు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. అయితే తాజా డెవలప్మెంట్ చూస్తుంటే ఇదంతా ఉత్త అబద్ధాలే అని అర్థ‌మైపోతోంది. కేవలం సానుభూతిని సంపాదించుకునేందుకే భువనేశ్వరి, లోకేష్, తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు.

ఎందుకంటే శుక్రవారం చంద్రబాబును ఏసీబీ కోర్టు జడ్జి వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వాకాబు చేశారు. జైలులో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అయితే దోమలు కుడుతున్నాయని, తనకు వేడి నీళ్ళు ఇవ్వటంలేదని, భువనేశ్వరి, లోకేష్, తమ్ముళ్ళు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించలేదు. ఎంతసేపు తనకు వయస్సు అయిపోయిందని, జైలులో ఉంచటం ద్వారా తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు చెప్పుకున్నారు.

తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని, తనకు బెయిల్ ఇవ్వాలని మాత్రమే రిక్వెస్ట్‌ చేసుకున్నారు. తాను చేసిన అభివృద్ధి గురించి దేశంలో ఎవరిని అడిగినా చెబుతారని చెప్పుకున్నారు. చంద్రబాబు చెప్పింది విన్నతర్వాత మానసికంగా పార్టీ అధినేత ఎంతగా కుంగిపోయారో అర్థ‌మవుతోంది. అయితే చంద్రబాబు చెప్పిన విషయాలపై ఏసీబీ కోర్టు జడ్జి పెద్దగా ఆసక్తి చూపినట్లులేదు. అందుకనే రెండోసారి కూడా జైలులోని సౌకర్యాలు ఎలా ఉన్నాయని మాత్రమే అడిగారు. జైలులో ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా అని అడిగారు.

అయితే చంద్రబాబు తన సహజ ధోరణిలో జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తాను ఏమి చెప్పదలచుకున్నారో అది మాత్రమే చెప్పారు. అంటే జైలులో సౌకర్యాలు బాగానే ఉన్నాయని అర్థ‌మవుతోంది. భువనేశ్వరి, లోకేష్, తమ్ముళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. జైలులో ఉండలేకపోతున్నట్లు చంద్రబాబు చెప్పారు కానీ సౌకర్యాల గురించి ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పలేదు. జడ్జితో మాట్లాడినప్పుడు కూడా సానుభూతిని సంపాదించుకుని బెయిల్ తెచ్చుకోవాలనే చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. నిజంగానే సౌకర్యాలు లేకపోతే అదే విషయాన్ని చెప్పి ఉండేవారు అన్నది వాస్తవం.

First Published:  23 Sep 2023 4:12 AM GMT
Next Story