Telugu Global
Andhra Pradesh

ఇవ‌న్నీ ఎవరి బిడ్డలు చంద్రబాబూ?

ఎవరో కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను తానే కష్టపడి నిర్మించినట్లుగా జగన్ చెప్పుకుంటున్నార‌ని చంద్రబాబు ఆరోపించారు. జగన్ చేస్తున్నది తప్పయితే మరి చంద్రబాబు చేస్తున్నది ఏమిటి? విజయనగరం జిల్లాలోని తోటపల్లి బ్యారెజీని తానే నిర్మించానని చెప్పుకున్నారు.

ఇవ‌న్నీ ఎవరి బిడ్డలు చంద్రబాబూ?
X

‘ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డని చెప్పుకునే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి’.. ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. అంటే ఎవరో కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను తానే కష్టపడి నిర్మించినట్లుగా జగన్ చెప్పుకుంటున్నారనేందుకు చంద్రబాబు పై వ్యాఖ్య చేశారు. జగన్ చేస్తున్నది తప్పయితే మరి చంద్రబాబు చేస్తున్నది ఏమిటి? విజయనగరం జిల్లాలోని తోటపల్లి బ్యారెజీని తానే నిర్మించానని చెప్పుకున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్. వైఎస్సార్ ప్రారంభిస్తే కాంగ్రెస్ హయాంలో దాదాపు పూర్తయిపోయింది.

అరాకొరా పనులు బ్యాలన్స్ ఉండ‌గా 2014లో ఎన్నికలు జరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మూడేళ్ళకు బ్యారెజిని ప్రారంభించారు. ప్రాజెక్టు మొత్తాన్ని తానే కట్టినట్లు అప్పట్లో చంద్రబాబు బిల్డప్ ఇచ్చుకున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదు. అయినా పోలవరం ప్రాజెక్టు తన మానసపుత్రికగా చంద్రబాబు చెప్పుకోవటంలేదా? డ్వాక్రా సంఘాలను తానే ఏర్పాటు చేసినట్లు కొన్ని వందలసార్లు చెప్పుంటారు.

నిజానికి డ్వాక్రా వ్యవస్థ‌ ఏర్పాటైంది పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నపుడు. సెల్ ఫోన్‌ తానే తెచ్చానని ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అది కూడా పీవీ హయాంలో వచ్చిందే. ఐటి ఇండస్ట్రీకి ఆధ్యుడు రాజీవ్ గాంధీ. అయితే తన వల్లే దేశంలో ఐటి పరిశ్రమ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం నిర్మించింది వైఎస్సార్ అయితే తానే నిర్మించినట్లు వందలసార్లు చెప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటుపోతే తనకు సంబంధంలేని ప్రాజెక్టులను తానే నిర్మించినట్లు, తనవల్లే వచ్చినట్లు చంద్రబాబు చెప్పుకుంటారు.

2014లో టిడ్కో ఇళ్ళను మొదలుపెట్టింది చంద్రబాబే. కానీ ఎందుకు పూర్తిచేయలేదు? పూర్తి చేసినట్లు కలరింగిచ్చి సామూహిక గృహప్రవేశాల పేరుతో పెద్ద డ్రామా చేశారు. నిజానికి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, డ్రైనేజి, మంచినీటి వసతులు ఏర్పాటు చేయలేదు. అందుకనే లబ్దిదారులు ఆ ఇళ్ళల్లో చేరలేదు. జగన్ కూడా వాటి విషయంలో నిర్లక్ష్యం చేయటంతో బాగా ఆలస్యమయ్యాయి. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పాత, కొత్త రెండింటిని ఇప్పుడు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. దీన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.

First Published:  20 Jun 2023 5:13 AM GMT
Next Story