Telugu Global
Andhra Pradesh

చిరంజీవితో విభేదాల్లేవు, నాగబాబుకి మెదడు లేదు –రోజా

తన గురించి పవన్ ఇంకోసారి ఏమైనా మాట్లాడితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు రోజా. పవన్ కేవలం సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ అని, రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు.

చిరంజీవితో విభేదాల్లేవు, నాగబాబుకి మెదడు లేదు –రోజా
X

పవన్ కల్యాణ్ రణస్థలం సభ తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. విమర్శలు, ప్రతి విమర్శల మంటలు ఏపీలో భోగి మంటల్ని డామినేట్ చేశాయి. డైమండ్ రాణి వివాదం చల్లారని నిప్పులా మారింది. ప్రతి రోజూ ఈ విషయంపై కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా మరోసారి డైమండ్ రాణి అనే విమర్శపై స్పందించారు మంత్రి రోజా. నిజ జీవితంలో తాను రాణినేనని చెప్పారు. సినిమాల్లో నటిగా, ఇంట్లో ఇల్లాలుగానే కాకుండా రాజకీయాల్లోనూ తనని తాను నిరూపించుకొని రాణిలా బతుకుతున్నానని అన్నారు.

చిరంజీవి వ్యాఖ్యలపై కౌంటర్..

వాల్తేరు వీరయ్య రిలీజ్ సందర్భంలో మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. రోజా పేరెత్తకుండానే పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. తన వల్ల మేలు జరగలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారని, తన మేలు స్వీకరించినవారు కూడా అలా మాట్లాడటం సరికాదన్నారు. తాను ఎవరెవరికి ఎంతెంత మేలు చేశానో వారికే తెలుసన్నారు. తనకు సంబంధం లేకపోయినా తన పేరుని రాజకీయాల్లకి లాగడంపై కూడా చిరు మండిపడ్డారు. నాగబాబు ఇచ్చే కౌంటర్లను కూడా సమర్థించారు చిరంజీవి. తాజాగా చిరు వ్యాఖ్యలపై రోజా స్పందించారు. చిరంజీవితో తనకు విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు రోజా.

ఇంకోసారి మాట్లాడితే బాగోదు..

తన గురించి పవన్ ఇంకోసారి ఏమైనా మాట్లాడితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు రోజా. పవన్ కేవలం సినిమాల్లో మాత్రమే గబ్బర్ సింగ్ అని, రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల ఓడిన పవన్‌ని చూసి ఎవరూ భయపడరని ఎద్దేవా చేశారు. పవన్ ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడని అభిప్రాయపడ్డారు.

మనిషి పెరిగాడు కానీ, నాగబాబుకి..

బ్రెయిన్ లెస్ అండే సెన్స్ లెస్ డైమండ్ రాణి అంటూ నాగబాబు వేసిన ట్వీట్లపై కూడా రోజా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నాగబాబు మనిషిగా ఎదిగారు గానీ, మెదడు పెరగలేదని కౌంటర్ వేశారు. పవన్‌కి, నాగబాబుకి మేల్ ఈగో అనేది ఎక్కువగా ఉందన్నారు. ఆ ఇద్దరికి రాసిచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప ఇంకేం తెలియదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క చోట కూడా గెలవని ఆ ఇద్దరు తనపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

First Published:  15 Jan 2023 2:07 AM GMT
Next Story