Telugu Global
Andhra Pradesh

వైసీపీలో అభ్యర్థుల కొరతా..?

25 స్థానాల్లో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మాత్రమే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకే మళ్ళీ టికెట్లిస్తారు.

వైసీపీలో అభ్యర్థుల కొరతా..?
X

వైసీపీపై బురదజ‌ల్లేసేందుకు ఎల్లోమీడియా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ప్ర‌చురించిన‌ బ్యానర్ స్టోరీ అలాంటిదే. ఇంతకీ విషయం ఏమిటంటే.. వైసీపీలో పోటీచేయబోయే నలుగురు ఎంపీల జాబితాను పార్టీ ఐదో జాబితాగా ప్రకటించింది. దాన్నిపట్టుకుని ఎల్లోమీడియా ‘అభ్యర్థుల కొరతతో అరకొరగా జాబితా’ అని పెద్ద స్టోరీ అచ్చేసింది. అధికారంలో ఉన్న వైసీపీకే అభ్యర్థుల కొరతగా ఉంటే, ఇక ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన తరఫున ఎవరు పోటీచేస్తారు..? ఇప్పుడు నాలుగు ఎంపీ స్థానాలను మాత్రమే వైసీపీ ఎందుకు ప్రకటించింది..?

ఎందుకంటే, 25 స్థానాల్లో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మాత్రమే అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకే మళ్ళీ టికెట్లిస్తారు. అంతే కానీ, మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను కొత్త అభ్యర్థులకు టికెట్లిస్తానని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తిని గూడూరు ఎమ్మెల్యేగా పోటీచేయించాలని అనుకున్నారు. అందుకనే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అయితే ఆదిమూలం ఎంపీగా పోటీచేయటానికి ఇష్టపడక పార్టీనే వదిలేశారు.

అందుకనే గురుమూర్తిని గూడురు ఎమ్మెల్యేగా వద్దని మళ్ళీ తిరుపతి ఎంపీగానే పోటీచేయించాలని అనుకున్నారు. ఇలాంటి మార్పులు జరగటం చాలా సహజం. వాస్తవం ఇదైతే వైసీపీకి అభ్యర్థుల కొరతంటూ స్టోరీలు రాసుకుని తృప్తిపడిపోతోంది. అసలు అభ్యర్థుల కొరతతో ఇబ్బందులు పడుతున్నవి టీడీపీ, జనసేన పార్టీలే అని అందరికీ తెలుసు. టీడీపీ+జనసేన కూటమి తరపున ఫైనల్ అయిన 13 మంది ఎంపీ అభ్యర్థుల్లో ముగ్గురు వైసీపీ ఎంపీలే ఉన్నారు.

నరసాపురం, నరసరావుపేట, మచిలీపట్నం స్థానాల్లో వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణంరాజు, లావు శ్రీకృష్ణదేవరాయులు, వల్లభనేని బాలశౌరికి టికెట్లు ఇచ్చాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎప్పుడెప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తారా..? అని రెండుపార్టీలు ఎదురు చూస్తున్నాయి. బాలశౌరి, లావుకు జగన్ టికెట్లు ఇచ్చుంటే మచిలీపట్నం, నరసరావుపేట నియోజకవర్గాల్లో కూటమికి గట్టి అభ్యర్థులే దొరికేవారు కాదన్నది వాస్తవం. పార్టీల్లో జరుగుతున్న వ్యవహారాలను రివర్సులో రాసుకుంటూ ఎల్లోమీడియా తృప్తిపడిపోతోంది.

First Published:  1 Feb 2024 6:32 AM GMT
Next Story