Telugu Global
Andhra Pradesh

చంద్రబాబును వీడని నంబర్ 23 సెంటిమెంట్‌..!

ఒకే ఒక్కసారి చంద్రబాబుకు 23 నంబర్‌ సానుకూల ఫలితం వచ్చింది. ఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో 23 ఓట్ల తేడాతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది టీడీపీ.

చంద్రబాబును వీడని నంబర్ 23 సెంటిమెంట్‌..!
X

తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే చంద్రబాబును నంబర్‌ 23 సెంటిమెంట్‌ మాత్రం వీడటం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి 23 నంబర్‌ చంద్రబాబును వెంటాడుతోంది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. ఇక చంద్రబాబు అరెస్ట్‌ అయిన తేదీ 9-9-23. ఈ మొత్తం అంకెలను కూడిన 23 వస్తుంది. ఇక రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబర్‌ కేటాయించారు. వీటన్నింటిని కలిపినా 23 నంబరే వస్తోంది. ఇక చంద్రబాబును ఈనెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.

గతంలో అమరావతి ల్యాండ్ స్కాం కేసులో నోటీసులిచ్చిన సీఐడీ 2021 మార్చి 23న విచారణకు హాజరు కావాలని పిలిచింది. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు గెలుచుకోగా.. ఆ ఫలితాలు వెలువడింది కూడా 2019 మే 23వ తేదీనే.

అయితే ఒకే ఒక్కసారి చంద్రబాబుకు 23 నంబర్‌ సానుకూల ఫలితం వచ్చింది. ఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో 23 ఓట్ల తేడాతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది టీడీపీ. ఈ ఫలితం కూడా మార్చి 23నే వెలువడింది. ఆ సమయంలో ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు మార్చి 23న 23 ఓట్ల తేడాతో ఎమ్మెల్సీ గెలవడం దేవుడి స్క్రిప్ట్ అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును 23 నంబర్ సెంటిమెంట్ వీడటం లేదంటూ సోషల్ మీడియా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  11 Sep 2023 5:20 AM GMT
Next Story