Telugu Global
Andhra Pradesh

బ్రో ఈవెంట్‌ని కంపుచేసిన వెంక‌టేష్‌

ఒక్క పేరూ స‌రిగా ప‌ల‌క‌లేదు. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌ని, ధ‌ర్మ‌తేజ అంటూ తొలి షాక్ ఇచ్చారు. ఈ సినిమాని త‌మిళంలో వినోదాయ‌సీతంగా తీసి తానే న‌టించిన స‌ముద్ర‌ఖ‌ని పేరుని కూడా చాలా త‌ప్పుగా ప‌లికారు.

బ్రో ఈవెంట్‌ని కంపుచేసిన వెంక‌టేష్‌
X

బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. జోరువానలోనూ ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ జోష్ చూపించారు. అయితే మొహ‌మాటానికో, సినీ నిర్మాత బంధువు కావ‌డం వ‌ల్ల‌నో వ‌చ్చిన అతిథి మాత్రం వేడుక‌ని పెంట పెంట చేసి పారేశారు. ఆయ‌నే టీజీ వెంక‌టేష్‌. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌గా, రాజ‌కీయనేత‌గా తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ చిర‌ప‌రిచితులు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో రాయ‌ల‌సీమ హ‌క్కులు పేరుతో చాలా పెద్ద ఉద్య‌మ‌మే న‌డిపారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ ఇప్పుడు బీజేపీలో ఉంటున్న టీజీ వెంక‌టేశ్ త‌న‌యుడు మాత్రం ఇంకా టీడీపీయే.

రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెడితే, కావాల‌ని చేశారో, యాదృచ్చికంగా జ‌రిగిందో కానీ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టీజీ వెంక‌టేశ్ త‌న ప్ర‌సంగంతో తీవ్ర అయోమ‌యం సృష్టించారు. సినిమారంగంపై పెద్ద‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల‌నో, నిర్వాహ‌కులు గెస్ట్ లిస్ట్ ఇవ్వ‌డంలో పొర‌పాటు చేశారేమో కానీ టీజీ వెంక‌టేశ్ ఒక్క పేరూ స‌రిగా ప‌ల‌క‌లేదు. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌ని, ధ‌ర్మ‌తేజ అంటూ తొలి షాక్ ఇచ్చారు. ఈ సినిమాని త‌మిళంలో వినోదాయ‌సీతంగా తీసి తానే న‌టించిన స‌ముద్ర‌ఖ‌ని పేరుని కూడా చాలా త‌ప్పుగా ప‌లికారు.. ద‌ర్శ‌కుడు స‌ముద్రాల అని మ‌ళ్లీ నాలిక్క‌రుచుకున్నారు.

ఇంకా విచిత్రం ఏంటంటే.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్నా అని సంబోధించి న‌వ్వులు పూయించారు. హీరోయిన్ కేతిక శ‌ర్మ‌ని కీర్తి శ‌ర్మ అని చెబుతూ త‌న ప్ర‌సంగంతో గంద‌ర‌గోళం సృష్టించారు.

టీజీ వెంక‌టేశ్ ప్ర‌సంగం మొత్తం మీద ఒక్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుని మాత్ర‌మే స‌రిగా ఉచ్ఛ‌రించారు. అలాగే ఈ సినిమాకి నిర్మాత అయిన త‌న క‌జిన్ టీజీ విశ్వ‌ప్ర‌సాద్ పేరు క‌రెక్టుగానే ప‌లికారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫంక్ష‌న్ల‌లో త‌న ప్ర‌సంగంతో న‌వ్వులు పూయించే బండ్ల గ‌ణేష్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మిస్స‌య్యార‌నే లోటుని టీజీ వెంక‌టేశ్ పూడ్చేశారు. టీజీ వెంక‌టేశ్ స్పీచ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌, మీమ్స్‌గా రూపాంత‌రం చెంది వైర‌ల్ అవుతోంది.

First Published:  27 July 2023 2:01 AM GMT
Next Story