Telugu Global
Andhra Pradesh

టెన్షన్ స్పష్టంగా కనబడుతోందా?

తనకు వ్యతిరేకంగా ఒక్క కేసు కూడా విచారణ జరగనివ్వరు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు నాలుగేళ్ళు ఏం చేశారని అడగటమే విచిత్రంగా ఉంది. చాలెంజ్‌లు చేసేదీ చంద్రబాబే వెంటనే స్టేలు తెచ్చుకునేదీ చంద్రబాబే. తాజా డెవలప్‌మెంట్‌తో చంద్రబాబు అండ్ కో ను విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది.

టెన్షన్ స్పష్టంగా కనబడుతోందా?
X

చంద్రబాబు నాయుడులో టెన్షన్ స్పష్టంగా కనబడుతోంది. టీడీపీ సర్కారు హయాంలో చోటు చేసుకున్న అవినీతి బాగోతాలపై విచారణ చేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. చంద్రబాబు మీద వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలు హైకోర్టులో కేసువేసి స్టే తెచ్చుకున్నారు. దాంతో సిట్ విచారణ ఆగిపోయింది.

హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో వెకేట్ చేయించేందుకు ప్రభుత్వానికి ఇంతకాలం పట్టింది. సరే ఇక అసలు విషయానికి వస్తే ఇదే విషయమై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విచారణ చేసుకోమని జగన్‌కు చాలెంజ్ విసిరారు. తన మీద ఆరోపణలు చేయటం తప్ప నాలుగేళ్ళు ఏమి చేశారు? అని ప్రశ్నించారు. నిజంగానే తాను అవినీతికి పాల్పడినట్లు జగన్ దగ్గర ఆధారాలుంటే తనను వదిలిపెట్టేవాడేనా? అంటు ప్రశ్నించారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తనపై ఎవరు విచారణకు ఆదేశించినా చంద్రబాబు వెంటనే కోర్టులో స్టే తెచ్చుకుంటారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా విచారణలు జరగకుండా ఎన్నికేసులు కోర్టుల్లో స్టేల్లో మూలుగుతున్నాయో. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ విచారణకు నోటీసులు ఇవ్వగానే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూకుంభకోణంపై విచారణకు ఆదేశిస్తే వెంటనే స్టే తెచ్చుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అవినీతిపై విచారణ అనగానే స్టే తెచ్చేసుకున్నారు.

తనకు వ్యతిరేకంగా ఒక్క కేసు కూడా విచారణ జరగనివ్వరు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు నాలుగేళ్ళు ఏం చేశారని అడగటమే విచిత్రంగా ఉంది. చాలెంజ్‌లు చేసేదీ చంద్రబాబే వెంటనే స్టేలు తెచ్చుకునేదీ చంద్రబాబే. తాజా డెవలప్‌మెంట్‌తో చంద్రబాబు అండ్ కో ను విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది. తన అరెస్టు తప్పదనే టెన్షన్ చంద్రబాబు మొహంలో స్పష్టంగా కనబడుతోంది. చంద్రబాబుకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందనే అనుకుంటున్నారు. మరి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా ముందు విచారణ, విచారణ తర్వాత అరెస్టు కూడా ఉంటుందా? నిజంగానే చంద్రబాబు అరెస్టయితే ఇంకేమన్నా ఉందా?

First Published:  4 May 2023 5:41 AM GMT
Next Story