Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు అబద్ధాలకు ఇదేనా సాక్ష్యం..? జరిగింది టీడీపీ సభే

ఓల్డ్ వికాస్ క్యాంపస్ లో 10 వేలమందితో జనవరి 1వ తేదీన మధ్యాహ్నం బహిరంగసభ జరుపుకునేందుకు అనుమతి కావాలంటూ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ గుంటూరు డీఎస్పీకి లెటర్ పెట్టుకున్నారు.

Chandrababu Naidu
X

చంద్రబాబు

గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయిన ఘ‌ట‌న‌కు తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదని చంద్రబాబు నాయుడు చేతులు దులిపేసుకున్నారు. జరిగిన కార్యక్రమానికి టీడీపీకి సంబంధమే లేదని, స్వచ్ఛంద సంస్థ‌ను ప్రోత్సహిద్దామనే తాను ముఖ్య అతిథిగా ప్రోగ్రామ్ కు హాజరైనట్లు చంద్రబాబు చెప్పారు. అధినేత చెప్పారు కాబట్టి తమ్ముళ్ళంతా అదే పాట పాడుతున్నారు. అయితే నిజానికి స్వచ్చంద సంస్థ‌ కానుకల ముసుగులో టీడీపీయే బహిరంగసభ నిర్వహించిందన్నది వాస్తవం.

అచ్చంగా చంద్రబాబు బహిరంగసభ అంటే జనాలు రారేమో అన్న భయం మొదలైంది. అందుకనే ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుకులు, జనతావస్త్రాల పంపిణీ అంటూ ప్రచారం చేశారు. 30 వేలమందికి కానుకలను పంపిణీ చేయబోతున్నట్లు నిర్వాహకులు విపరీతంగా ఊదరగొట్టారు. దాంతో కానుకల కోసం జనాలు సదాశివనగర్, ఓల్డ్ వికాస్ క్యాంపస్ లో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. ఇక్కడ అర్థ‌మవుతున్నదేమంటే కానుకల పేరుతో టీడీపీ జనాలను మోసం చేసిందని.

ఓల్డ్ వికాస్ క్యాంపస్ లో 10 వేలమందితో జనవరి 1వ తేదీన మధ్యాహ్నం బహిరంగసభ జరుపుకునేందుకు అనుమతి కావాలంటూ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ గుంటూరు డీఎస్పీకి లెటర్ పెట్టుకున్నారు. బహిరంగసభలో చంద్రబాబునాయుడు పాల్గొంటారని కూడా శ్రవణ్ చెప్పారు. డీఎస్సీ కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. శ్రవణ్ లెటర్లో ఎక్కడా ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు.

అంటే ఇక్కడ అర్థ‌మవుతున్నదంటే టీడీపీ జనాలను అమాయ‌కుల‌ను చేసిందని. చంద్రబాబు బహిరంగసభ అంటే జనాలు రారన్న అనుమానంతోనే కానుకలపేరుతో ఎరవేశారు. ఎలాంటి ఘటన జరగకుండా ఉండుంటే బహిరంగసభ బ్రహ్మాండంగా జరిగిందని టీడీపీ, ఎల్లోమీడియా డప్పుకొట్టుకునే వారే. అయితే ఊహించని విధంగా ప్రమాదం జరగటంతో బహిరంగ సభకు తమకు సంబంధంలేదని చంద్రబాబు అండ్ కో చేతులు దులిపేసుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. గ్రౌండ్లో తొక్కిసలాట జరిగిందని, ఒక మహిళ చనిపోయిందని చంద్రబాబుకు తెలిసినా వెనక్కు రాకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారట.

First Published:  3 Jan 2023 5:44 AM GMT
Next Story