Telugu Global
Andhra Pradesh

తెలుగుజాతి అంటే..ఎన్టీయార్, తెలుగుదేశంపార్టీ మాత్రమేనా?

చంద్రబాబునాయుడు మొదలుకుని కిందస్ధాయి వరకు తమ్ముళ్ళు చెబుతున్నదేమంటే ఎన్టీయార్ పేరు తీసేయటమంటే తెలుగుజాతిని అవమానించటమే అని. ఇక్కడే వీళ్ళ ఓవరాక్షన్ బయటపడుతోంది.

తెలుగుజాతి అంటే..ఎన్టీయార్, తెలుగుదేశంపార్టీ మాత్రమేనా?
X

తెలుగుదేశంపార్టీ ఏదిచేసినా చాలా ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తుంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాక్షన్ మరీ ఎక్కువయిపోయింది. తాజాగా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరుపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎలాగూ మెజారిటి ఉందికాబట్టి శాసనసభ, శాసనమండలిలో తీర్మానం ఆమోదం కూడా అయిపోయింది. దీంతో చట్టసభల్లోను బయటా టీడీపీ ఒకటే గోల మొదలుపెట్టేసింది.

చంద్రబాబునాయుడు మొదలుకుని కిందస్ధాయి వరకు తమ్ముళ్ళు చెబుతున్నదేమంటే ఎన్టీయార్ పేరు తీసేయటమంటే తెలుగుజాతిని అవమానించటమే అని. ఇక్కడే వీళ్ళ ఓవరాక్షన్ బయటపడుతోంది. ఎన్టీయార్ పేరు తీసేయటమంటే అది ఎన్టీయార్ ను అగౌరవించటం అంటే అర్ధముంది. అంతేకానీ తెలుగుజాతి మొత్తాన్ని అవమానించిట్లు ఎలాగవుతుంది ? ఎన్టీయార్ కు ఏదైనా జరిగినపుడు తెలుగుజాతికి అవమానం జరిగినట్లుగా భావించాల్సుంటే అది చంద్రబాబు, ఎన్టీయార్ కుటుంబం, టీడీపీ మెడకే చుట్టుకుంటుంది. చంద్రబాబు, ఎన్టీయార్ కుటుంబం కలిసి ఎన్టీయార్ కు చేసిన ద్రోహం తెలుగుజాతి మొత్తానికి తెలుసు.

Advertisement

ఇక పేరు మార్పు విషయానికి వస్తే తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటి స్టేడియం ఉంది. దశాబ్దాలుగా ఆ స్టేడియంకున్న ఎస్వీ యూనివర్సిటి స్టేడియం అనే పేరును చంద్రబాబు ఎవరితోను మాట్లాడకుండానే తారకరామా స్పోర్ట్స్ పెవిలియన్ అని మార్చేశారు. అప్పుడు తిరుపతిలో ఆందోళనలు జరిగినా చంద్రబాబు లెక్కచేయలేదు. ఎప్పుడో జరిగిన విషయాలను వదిలేస్తే 2014-19 మధ్యలో కూడా ఎన్టీయార్ హెల్త్ స్కీమ్ నుండి ఎన్టీయార్ పేరును ఎత్తేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని కొత్త పేరుపెట్టాలని స్వయంగా చంద్రబాబే అన్న వీడియో క్లిప్పింగు ఇపుడు వైరల్ అవుతోంది.

Advertisement

ఇక్కడ గమనించాల్సిందేమంటే అధికారంలోఉన్నపుడు చంద్రబాబుకు ఎన్టీయార్ పేరు గుర్తుకురాదు. ప్రతిపక్షంలో మారగానే వెంటనే ఎన్టీయార్ జపం మొదలుపెడతారు. ఈ విషయాన్ని అధికార భాషా సంఘం ఛైర్మన్ గా రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉదాహరణలతో సహా వివరించారు. కాబట్టి సంస్ధలకో లేకపోతే వ్యవస్ధలకో పేర్లు మార్చినంత మాత్రాన మామూలు జనాలకు లాభనష్టాలేమీ ఉండవు. వాటిద్వారా అందే సేవలగురించి మాత్రమే జనాలు ఆలోచిస్తారు. పేరుమార్పు కరెక్టేనా కాదా అంటే ఎప్పటినుండో ఉన్న ఎన్టీయార్ పేరును మార్చటం జగన్ విచక్షణకే వదిలేయాలి.

Next Story