Telugu Global
Andhra Pradesh

మాధవ్‌ది చిన్న వ్యవహారమా?- కాలర్‌తో అనిత వాగ్వాదం

బోండా ఉమా, బుద్దా వెంకన్నల సెక్స్‌ రాకెట్ కుంభకోణాన్ని అతడు ప్రస్తావించగా అధికారంలో ఉన్నారు కదా నిరూపించి చర్యలు తీసుకోండి అంటూ అనిత సవాల్ చేశారు.

మాధవ్‌ది చిన్న వ్యవహారమా?- కాలర్‌తో అనిత వాగ్వాదం
X

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను విమర్శించవద్దంటూ ఒక వ్యక్తి టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితకు ఫోన్ చేశాడు. మాధవ్‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అతడు ప్రశ్నించారు. చిన్న విషయాన్ని పట్టుకుని పెద్దది చేస్తున్నారని అనితను నిలదీశాడు. అందుకు అనిత అతడితో వాగ్వాదానికి దిగారు. మీడియా కెమెరాల ముందే ఆమె ఫోన్ కాల్ మాట్లాడారు.

మాధవ్‌ తప్పు చేసి ఉంటే న్యాయస్థానాలు తేలుస్తాయని మీరెందుకు మాట్లాడుతున్నారని అతడు ప్రశ్నించగా.. అంటే ప్రతిపక్షం ఏది మాట్లాడకుండా ఉండాలా అని ఆమె నిలదీశారు. ఎంపీ దిగంబరంగా ఒక మహిళతో వీడియో కాల్‌ మాట్లాడితే అది చిన్న విషయమా.. మీ ఇంట్లోని మహిళల పట్ల ఇలాగే చేస్తే ఊరుకుంటారా అని అనిత ప్రశ్నించారు.

ఇంట్లో ఆడవాళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి వ్యక్తులను లోక్‌సభకు పంపుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నల సెక్స్‌ రాకెట్ కుంభకోణాన్ని అతడు ప్రస్తావించగా అధికారంలో ఉన్నారు కదా నిరూపించి చర్యలు తీసుకోండి అంటూ అనిత సవాల్ చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. చివరకు మహిళా మంత్రి అయిన రోజా కూడా మాధవ్‌ను వెనుకేసుకొస్తున్నారని ఇలాంటి వారిని మ్యూజియంలో ఉంచాలన్నారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబుకే నోటీసులు ఇచ్చిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మరి న్యూడ్‌గా కనిపించిన గోరంట్ల మాధవ్‌కు ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలపలేదని ప్రశ్నించారు.

తొలిరోజు వాస్తవం అని తేలితే కఠిన చర్యలు అని చెప్పి.. రెండు రోజుల తర్వాత రోజాను రంగంలోకి దింపి.. టెస్టింగ్‌కు పంపాం, రిపోర్టు రావాలి కదా, వెయిట్ చేయండి అనిపించారని.. చివరకు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అందులో తప్పేముంది ?, నాలుగు గోడల మధ్య వ్యవహారం, బలత్కారం లేదు కదా, మహిళ కేసు పెట్టలేదు కదా అంటూ గోరంట్ల మాధవ్‌ను వెనుకేసుకొచ్చారని ఇదేనా.. వైసీపీ సిద్ధాంతం అని అనిత ప్రశ్నించారు.

First Published:  9 Aug 2022 10:17 AM GMT
Next Story