Telugu Global
Andhra Pradesh

మళ్లీ ఓడేందుకు అంత తొందరెందుకు బాబు

ఎన్నికలు జరిగినా మరోసారి టీడీపీ ఓడిపోతుందని.. మరోసారి ఓడిపోవడానికి చంద్రబాబుకు ఎందుకు అంత తొందర అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఐదేళ్లు పూర్తి కాగానే ఎన్నికలు వస్తాయని అప్పుడు ఓడిపోయేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలన్నారు.

మళ్లీ ఓడేందుకు అంత తొందరెందుకు బాబు
X

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలన్న చంద్రబాబు సవాల్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్ లైట్ తీసుకున్నారు. ఎన్నికలు జరిగినా మరోసారి టీడీపీ ఓడిపోతుందని.. మరోసారి ఓడిపోవడానికి చంద్రబాబుకు ఎందుకు అంత తొందర అని ప్రశ్నించారు. ఐదేళ్లు పూర్తి కాగానే ఎన్నికలు వస్తాయని అప్పుడు ఓడిపోయేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉండాలన్నారు.

మళ్లీ గెలిస్తే తప్ప అసెంబ్లీ రాబోనని చంద్రబాబు ఇప్పటికే మంగమ్మ శపథం చేశారని.. కాబట్టి ఇక ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచేది లేదు కాబట్టి చంద్రబాబు ఇక అసెంబ్లీకి వచ్చేది ఉండదన్నారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలులోనూ అభివృద్ధి జరగాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

చంద్రబాబు మాత్రం రాజకీయ పరమైన విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ఉత్తరాంధ్రపైకి అమరావతివాదులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. విశాఖలో రాజధాని వద్దంటూ మా ప్రాంతానికి వచ్చి మా అరసవెల్లి దేవుడిని వీరు మొక్కుతారా అని ప్రశ్నించారు. మా ప్రాంతానికి వ్యతిరేకంగా ఈ దయ్యాలు వచ్చి మా దేవుడిని మొక్కుతామంటే ఇక్కడి ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే ఉండదన్నారు.

చంద్రబాబుకు నచ్చినట్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలా అని ప్రశ్నించారు. ప్రజలు ఐదేళ్లకు తీర్పు ఇచ్చారని.. ఐదేళ్ల తర్వాత ఎన్నికల్లో తేల్చుకుందామన్నారు. 26 జిల్లాలతో పని లేదు 29 గ్రామాలే మాకు కావాలి అని చంద్రబాబు అనుకుంటే నేరుగా చెప్పాలని మంత్రి అమర్నాథ్‌ డిమాండ్ చేశారు.

First Published:  15 Sep 2022 5:18 AM GMT
Next Story