Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు మౌనవ్రతంలో ఉన్నారా..?

విచారణలో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునేందుకు ఎల్లోమీడియా ప్రయత్నించినా జనాలెవరూ పట్టించుకోలేదు.

చంద్రబాబు మౌనవ్రతంలో ఉన్నారా..?
X

ఏమి మాట్లాడాలో తెలీక చంద్రబాబునాయుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. రాజధాని వివాదంపై విచారణలో భాగంగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదుకానీ తాజా వ్యాఖ్యలు మాత్రం ఎల్లోబ్యాచ్ కు షాక్ కొట్టిందనే చెప్పాలి. హైకోర్టు తీర్పే జగన్మోహన్ రెడ్డికి శిరోధార్యమని ఇంతకాలం చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా అనుకున్నది. అయితే విచారణ సందర్భంగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లే ఉంది. దాంతో ఏమిచేయాలో వీళ్ళకి అర్ధం కావటంలేదు.

విచారణలో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునేందుకు ఎల్లోమీడియా ప్రయత్నించినా జనాలెవరూ పట్టించుకోలేదు. మౌళికమైన ప్రభుత్వ వాదననే సుప్రింకోర్టు సమర్ధించినట్లయ్యింది. రాజధాని నిర్మాణంలో కానీ అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో కానీ హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది అన్న సుప్రింకోర్టు వ్యాఖ్యలే భవిష్యత్తులో రాబోయే తీర్పున‌కు సంకేతాలని మంత్రులు చెప్పుకుంటున్నారు.

హైకోర్టు తీర్పిచ్చినపుడు చాలామంది ఇదే విధంగా ఆశ్చర్యపోయారు. అయితే తీర్పుపై ఏమీ మాట్లాడలేకపోయారు. అలాంటి వాళ్ళంతా సుప్రింకోర్టు తాజావ్యాఖ్యలతో హ్యాపీగా ఫీలవుతున్నారు. సరే వీళ్ళ గోల ఎలాగున్నా ఇపుడు చంద్రబాబు మౌనవ్రతమే అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇంతకాలం అమరావతే ఏకైక రాజధానంటు నానా రచ్చచేసిన అమరావతి జేఏసీకి ఇప్పుడు దిక్కుతోచటంలేదు. సుప్రింకోర్టు వ్యాఖ్యలతో ఎల్లోమీడియా కూడా అమరావతి జేఏసీని పట్టించుకోవటంలేదు. సుప్రింకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా ఇంకా అమరావతే అని చంద్రబాబు మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో భారీనష్టం తప్పదని అర్ధమైపోయినట్లుంది.

ఇప్పటికే చంద్రబాబు, ఎల్లోమీడియా వైఖరి వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీకి ఇబ్బందులు మొదలయ్యాయి. కేవలం 29 గ్రామాలను నమ్ముకుని పార్టీగెలుపును పణంగా పెట్టారంటు చంద్రబాబుపై పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయట. ఇంతకాలం తన మీడియా బలంతో రాజధాని జనాలనుకూడా చంద్రబాబు భ్రమల్లో ముంచేసినట్లు అందరికీ అర్ధమవుతోంది. దాంతో మొదటికే మోసం వస్తుందన్న భయంతోనే చంద్రబాబు మౌనవ్రతం పాటిస్తున్నట్లున్నారు. జనవరి 31 జరగబోయే విచారణ తర్వాత ఇంకే వ్రతంచేస్తారో చూడాల్సిందే.

First Published:  5 Dec 2022 4:47 AM GMT
Next Story