Telugu Global
Andhra Pradesh

పవన్‌ను ముంచిన చంద్రబాబు బీజేపీనీ ముంచేస్తాడా..?

బిజెపి అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారని వారు ఫిర్యాదు చేశారు. బిజెపి అంతగా బలం లేని, బిజెపి గెలవడానికి అవకాశం లేని సీట్లను చంద్రబాబు కేటాయిస్తున్నారని వారు మండిపడ్డారు.

పవన్‌ను ముంచిన చంద్రబాబు బీజేపీనీ ముంచేస్తాడా..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుపై ఆంధ్రప్రదేశ్‌ బిజెపి నాయకులు మండిపడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను నిండా ముంచిన చంద్రబాబు, ఇప్పుడు బిజెపిని ముంచడానికి సిద్ధపడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు తీరుపైనే కాకుండా బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీరుపై కూడా బిజెపి నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ బిజెపి సీనియర్‌ నేతలు 16 మంది పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు.

బిజెపి అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారని వారు ఫిర్యాదు చేశారు. బిజెపి అంతగా బలం లేని, బిజెపి గెలవడానికి అవకాశం లేని సీట్లను చంద్రబాబు కేటాయిస్తున్నారని వారు మండిపడ్డారు. రెండు దశాబ్దాలుగా టీడీపీ విజయం సాధించని బద్వేలు, జమ్మలమడుగు, అనపర్తి, విజయవాడ వెస్ట్‌, ఆదోనీ వంటి సీట్లు బిజెపికి కేటాయించడాన్ని వారు వ్యతిరేకించారు. కడప జిల్లాలో రెండు సీట్లు కేటాయించడంపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

బద్వేల్ వంటి నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు కూడా లేరని వారన్నారు. పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని వారు ఆ లేఖలో కోరారు.

First Published:  15 March 2024 6:34 AM GMT
Next Story