Telugu Global
Andhra Pradesh

సామాన్యులూ అదే పనిచేస్తే స‌మ‌ర్థిస్తారా సజ్జల?- రామ్మోహన్‌ నాయుడు

ఇంకా ఎంత మంది వైసీపీ నేతల చెత్త ఆడియో, వీడియో టేపులను ప్రజలు చూడాల్సి వస్తుందో కూడా చెప్పాలన్నారు. లైంగిక వ్యవహారాల విషయంలో చర్యలు తీసుకోవడం మొదలుపెడితే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్న విషయం ఆ పార్టీ పెద్దలకూ తెలుసన్నారు.

సామాన్యులూ అదే పనిచేస్తే స‌మ‌ర్థిస్తారా సజ్జల?- రామ్మోహన్‌ నాయుడు
X

గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకునేందుకు ఎందుకు భయపడుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. కఠిన చర్యలు తీసుకుంటామని లీకులిచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు మాత్రం అది ప్రైవేట్ వ్యవహారం, నాలుగు గోడల మధ్య జరిగిందని ఎలా మాట్లాడుతున్నారని నిల‌దీశారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటే వైసీపీలో సగానికి సగం మంది నేతలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్న భయంతో వైసీపీ ఉందా అని ప్ర‌శ్నించారు. ఇంకా ఎంత మంది వైసీపీ నేతల చెత్త ఆడియో, వీడియో టేపులను ప్రజలు చూడాల్సి వస్తుందో కూడా చెప్పాలన్నారు.


లైంగిక వ్యవహారాల విషయంలో చర్యలు తీసుకోవడం మొదలుపెడితే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్న విషయం ఆ పార్టీ పెద్దలకూ తెలుసన్నారు. నాలుగు గోడల మధ్య ఎంపీ చేశారని సజ్జల మాట్లాడుతున్నారని.. అదే తరహాలో సామాన్యులు కూడా నాలుగు గోడల మధ్య వీడియో కాల్ చేసి మహిళలకు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే సమర్థిస్తారా అని రామ్మోహన్ నాయుడు నిలదీశారు.

రేప్‌ కేసు ఉందని అఫిడవిట్‌లో స్పష్టంగా చెప్పినా టికెట్ ఇచ్చారని.. పరోక్షంగా ఇలాంటి పనులను వైసీపీ నాయకత్వం సమర్థిస్తోందన్నారు. ఒక ఎంపీకి చెందిన ఒక వీడియో బయటకు రావడం అంటే అది మొత్తం ఎంపీలందరి పరువుకు సంబంధించిన అంశమన్నారు. పార్లమెంట్‌ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మొత్తం ఎంపీలందరిపైనా ఉందని, అందుకే లోక్‌సభ స్పీకర్‌కు కూడా లేఖ రాశామన్నారు. ఆ వీడియోపై దర్యాప్తు చేసి మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

పార్లమెంట్‌పై ప్రజల్లో నమ్మకం పోయేలోపే దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీలంతా ఇలాంటి వారే అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి పనులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇతరులు కూడా ఇలాగే విచ్చలవిడితనంతో వ్యవహరించే అవకాశం ఉందని.. కాబట్టి జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

First Published:  9 Aug 2022 7:02 AM GMT
Next Story