Telugu Global
Andhra Pradesh

నిమ్మల రామనాయుడికి అవమానం

బస్సులోని ప్రయాణికులతో మాట కలిపారు. తర్వాత జగన్ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలుపెట్టారు. అంతలో కొందరు ఆడవాళ్లు జగన్‌ బాగా చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు.

నిమ్మల రామనాయుడికి అవమానం
X

పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. బస్సులో ఆయనపై మహిళలు తిరగబడ్డారు. మహిళలను బెదిరించడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే చివరకు తానే బస్సు దిగి వెళ్లిపోయారు. అమరావతి వాదుల పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే నిమ్మల.. అనంతరం ఒక ఆర్టీసీ బస్సు ఎక్కారు.

బస్సులోని ప్రయాణికులతో మాట కలిపారు. తర్వాత జగన్ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలుపెట్టారు. అంతలో కొందరు ఆడవాళ్లు జగన్‌ బాగా చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు. ఆ దృశ్యాలను ఒక మహిళ ఫోన్‌లో రికార్డు చేస్తుండడాన్ని గమనించిన రామనాయుడు ఫోన్ లాగేసుకున్నారు.

దీంతో సదరు మహిళకు కోపం వచ్చింది. ఎమ్మెల్యే మెడలో ఉన్న కండువాను పట్టుకుని లాగేందుకు ప్రయత్నించింది. దాంతో బిత్తరపోయిన ఎమ్మెల్యే ఆగమ్మ.. ఆగు అంటూ సర్ది చెప్పేప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

First Published:  10 Oct 2022 2:02 AM GMT
Next Story