Telugu Global
Andhra Pradesh

టీడీపీలో టికెట్ కోసం భార్యతో భర్త పోటీ

వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఆదిరెడ్డి భవానీ భర్త వాసు చెబుతున్నారు. తనను కలిసి కేడర్‌కు అదే విషయం చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది.

టీడీపీలో టికెట్ కోసం భార్యతో భర్త పోటీ
X

రాజమండ్రి అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఇంట్లో టికెట్ల కోసం పోరాటం నడుస్తోంది. ఈసారి ఆమె భర్త పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనను కలిసి కేడర్‌కు అదే విషయం చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఆదిరెడ్డి భవానీ భర్త వాసు చెబుతున్నారు. ఈ విషయం ఇటీవల చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లినట్టు చెబుతున్నారు. దాంతో ఆయన క్లాస్‌ తీసుకున్నారని... ఎలాగో జిల్లాలో మహిళలకూ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి భవానీ సరైన అభ్యర్థి అని చంద్రబాబు స్పష్టం చేసినట్టు ప్రచారం నడుస్తోంది. సిట్టింగ్‌లే పోటీ చేస్తారని కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

అయినప్పటికీ వాసు మాత్రం.. ఆఖరిలో తన పేరే ఖాయమవుతుందని ధీమాగా ఉన్నారు. నిజానికి ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు పేరున్న నేతే. కాకపోతే మహిళలకు సీట్ల సర్దుబాటు కోణంలో గత ఎన్నికల్లో ఎర్రన్నాయుడు కుమార్తె, వాసు భార్య అయిన ఆదిరెడ్డి భవానికి టికెట్ ఇచ్చారు. ఆమె విజయం సాధించారు. మహిళ కావడం, పుట్టింటి బలం ఉండడంతో ఆమె బాగానే పార్టీలో గ్రిప్ సాధించారు.

ఇప్పుడు తిరిగి ఆదిరెడ్డి కుటుంబం వారసుడిగా తాను నిలబడాలని వాసు భావిస్తున్నారు. వైసీపీ నుంచి ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు టీడీపీలోకి రావడానికి కారణాల్లో... తన కుమారుడికి వైసీపీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నది ఒకటి. టీడీపీలోకి వచ్చిన తర్వాత కోడలు ఎమ్మెల్యే అయ్యారే గానీ.. కుమారుడు ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇప్పుడు ఆదిరెడ్డి కుటుంబానికి భవానే ముఖచిత్రం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో వారసుడిగా తాను పగ్గాలు తీసుకునేందుకు ఆదిరెడ్డి వాసు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే అధిష్టానం వద్ద ఆయనకు గ్రిప్‌ దొరకడం లేదన్న చర్చ నడుస్తోంది.

First Published:  2 Oct 2022 6:31 AM GMT
Next Story