Telugu Global
Andhra Pradesh

బాల‌య్య వ‌చ్చేశాడు.. అభిమానులూ ఒళ్లు జాగ్ర‌త్త‌!

ఓ అభిమాని ఆయ‌న్ను సెల్ఫీలో బంధించ‌బోయాడు. అంతే బాబుకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్క‌టి పీకాడు. దీంతో అభిమాని షాక్‌. అయితే బాల‌య్య‌బాబు ప్ర‌చారంలోకి వ‌చ్చేశాడు.. మ‌నోణ్ని ఒక్క‌టి పీకేశాడు.

బాల‌య్య వ‌చ్చేశాడు.. అభిమానులూ ఒళ్లు జాగ్ర‌త్త‌!
X

హిందూపురం అసెంబ్లీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఈ రోజు నుంచి బ‌స్సు యాత్ర ప్రారంభించ‌బోతున్నారు. అయితే మా బాల‌య్య బాబు వ‌చ్చేశాడ‌ని అత్యుత్సాహంతో ముందుకెళితే మాత్రం ఫ్యాన్స్‌కు గూబ గుయ్యిమ‌న‌డం ఖాయం. అదే బాల‌య్య బాబు మాట‌ల్లో చెప్పాలంటే ద‌బిడి దిబిడే. ప్ర‌చారం కోసం శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో ల్యాండ్ అయ్యీ అవ‌గానే ఓ అభిమాని గూబ మీద ఒక్క‌టిచ్చాడు.

ద‌బిడి దిబిడి మొద‌ల‌యిన‌ట్లే..

స‌త్య‌సాయి జిల్లా కేంద్రంలో హెలికాఫ్ట‌ర్ దిగగానే బాల‌కృష్ణను చూడ‌టానికి అభిమానులు దూసుకొచ్చారు. త‌న మీద‌కు వ‌స్తే అభిమాని అయినా స‌రే లాగి ఒక్క‌టిచ్చుకోవ‌డం నంద‌మూరి న‌ట‌సింహం స్టైల్ అని మ‌ర్చిపోయిన ఓ అభిమాని ఆయ‌న్ను సెల్ఫీలో బంధించ‌బోయాడు. అంతే బాబుకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్క‌టి పీకాడు. దీంతో అభిమాని షాక్‌. అయితే బాల‌య్య‌బాబు ప్ర‌చారంలోకి వ‌చ్చేశాడు.. మ‌నోణ్ని ఒక్క‌టి పీకేశాడు.. ఇక ద‌బిడి దిబిడి మొద‌ల‌యిపోయిన‌ట్లే అప్పుడే ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్టేస్తున్నారు.

బూతులు తిట్టినా, లాగికొట్టినా ఆయ‌న‌కే చెల్లు

ఎవ‌డ్రా నువ్వు .. అని నోటికొచ్చిన‌ట్లు బూతులు తిట్టినా, సెల్ఫీలు, ఫొటోల కోసం ఎగ‌బ‌డే అభిమానుల్ని లాగి ఒక్క‌టిచ్చినా ఆయ‌న ఫ్యాన్స్ ఏమీ అనుకోరు. కానీ ప్ర‌జాక్షేత్రంలో కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌నే ఆలోచ‌న బాల‌కృష్ణ‌కు రాదు. చంద్ర‌బాబూ చెప్ప‌డు. క‌నీసం ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కాస్త నోటి దూల‌, చెయ్యి విసురుడూ త‌గ్గించుకోవాలి బాల‌య్య బాబూ అని టీడీపీ కార్యక‌ర్త‌లు గొణుక్కుంటున్నారు. పైకి అంటే త‌మ‌ను కొడ‌తాడ‌ని వాళ్ల భ‌యం పాపం!

First Published:  13 April 2024 6:52 AM GMT
Next Story