Telugu Global
Andhra Pradesh

రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలి.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని విధాలుగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలి.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ త‌ర‌ఫున‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా తేలలేదు. సీఎం పదవిపై చాలామంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకోవడంతో అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారింది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని విధాలుగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని, చంద్రబాబు మరొకసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం సంతోషాన్ని నింపిందని జేసీ చెప్పారు.

First Published:  5 Dec 2023 11:03 AM GMT
Next Story