Telugu Global
Andhra Pradesh

2024లోగా మ‌మ్మ‌ల్ని చంపేయ్‌.. లేదంటే నువ్వు చ‌స్తావ్ కొడాలి నానీగా..

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడేప‌ల్లి పీఎస్ లో టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు.

2024లోగా మ‌మ్మ‌ల్ని చంపేయ్‌.. లేదంటే నువ్వు చ‌స్తావ్ కొడాలి నానీగా..
X

కొడాలి నాని 2024లోగా త‌మ‌ని చంపేయాల‌ని, లేదంటే తామే కొడాలి నానిని చంపేస్తామంటూ హెచ్చ‌రించారు టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న‌. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడేప‌ల్లి పీఎస్ లో టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంక‌న్న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కొడాలి నాని పుట్టుక గురించి తెలియ‌కే అంద‌రి పుట్టుక గురించి మాట్లాడుతున్నాడ‌ని, వాడికి తండ్రి ఎవ‌రో తెలియ‌దని అందుకే అంద‌రినీ అదే భాష‌లో తిడుతున్నాడ‌ని ఆరోపించారు. ఎన్టీఆర్‌ని పొగుడుతూ ఆయ‌న కుమార్తె భువ‌నేశ్వ‌రీని రోజూ తిట్టే కొడాలి నానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని హెచ్చ‌రించారు. నానిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామ‌న్నారు. పోలీసుల‌కి ఫిర్యాదు ఇచ్చిన వారిలో మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, టీడీపీ నేత‌లు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, వ‌ర్ల రామ‌య్య‌, ఎమ్మెల్యే గ‌ద్దె రామ‌మోహ‌న్ వున్నారు.

First Published:  10 Sep 2022 2:46 PM GMT
Next Story