Telugu Global
Andhra Pradesh

ఆడ‌వాళ్ల నిర‌స‌న‌ల‌కు తోడు... ఇప్పుడు పిల్ల‌ల శాపనార్థాలు

జగన్ మీద కసితో చిన్నపిల్లల భవిష్యత్తును టీడీపీ+ఎల్లోమీడియా ఎంతలా నాశనం చేస్తున్నాయో అర్థ‌మైపోతోంది. పిల్లల మెదళ్ళల్లో విషాన్ని నింపుతున్నాయి.

ఆడ‌వాళ్ల నిర‌స‌న‌ల‌కు తోడు... ఇప్పుడు పిల్ల‌ల శాపనార్థాలు
X

ఐదు కోట్ల ఆంధ్రులకు బాసటగా నిలిచిన చంద్రబాబును సైకో జగన్ జైలుకు పంపాడు...

ఆంధ్రప్రదేశ్‌ను ఒక నేరగాడు పాలిస్తున్నాడు, ముద్దాయిలు మంత్రులైన రాష్ట్రం, ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము చెల్లిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే..

పై ఆరోపణలు చేసింది ఎవరో తెలుసా? టీడీపీ సీనియర్ నేతలో లేకపోతే ఎల్లోమీడియా సొంత కథనాలో కావు. 5, 6 తరగతి చదువుతున్న పిల్లలు. రాజమండ్రిలో సత్యమేవ జయతే అని చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఆ దీక్ష సందర్భంగా రాజమండ్రిలో 6వ తరగతి చదువుతున్న పార్థు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన ఆరోపణలు, కామెంట్లు. జగన్నోహన్ రెడ్డిని ఉద్దేశించి పార్థు ఇంకా చాలా కామెంట్లు, ఆరోపణలు చేశాడు.

ఇక గూడురులో చదువుతున్న అనిత్ కూడా అక్కడ జరిగిన దీక్షలో మాట్లాడుతూ.. జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. నిజానికి 5, 6 తరగతలు చదివే పిల్లలకు తమ పాఠాలు చదువుకుని, హోంవర్కులు చేసుకోవటమే పెద్ద తలనొప్పి. అలాంటిది రాజకీయాల గురించి మాట్లాడుతూ.. జ‌గ‌న్‌ను సైకో జగన్ అని, చంద్రబాబు రాష్ట్రానికి ఎంత సేవ చేశాడనే విషయాలు ఎలా తెలుస్తాయి. 5, 6 తరగతులు చదివే పిల్లల వయసెంత? రాజకీయాలపైన వాళ్ళకుండే పరిజ్ఞానం ఎంత?

అయినా వీళ్ళు జగన్‌ను పట్టుకుని ఇంతలా తిడుతున్నారంటే వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళకి ఎంతలా ట్రైనింగ్ ఇచ్చుంటారు? దాన్ని బట్టీ పెట్టించి దీక్షా శిబిరాల్లో ప్రభుత్వాన్ని, జగన్‌ను పట్టుకుని అమ్మనాబూతులు తిట్టించటం ఏమిటో అర్థంకావటంలేదు. దాన్ని ఎల్లోమీడియా యథాతథంగా ముద్రించి తన కసినంతా తీర్చుకుంది. వైఎస్ మరణం గురించి కూడా చాలా అసహ్యంగా పిల్లలు మాట్లాడారు.


ఇదంతా చూస్తుంటే జగన్ మీద కసితో చిన్నపిల్లల భవిష్యత్తును టీడీపీ+ఎల్లోమీడియా ఎంతలా నాశనం చేస్తున్నాయో అర్థ‌మైపోతోంది. పిల్లల మెదళ్ళల్లో విషాన్ని నింపుతున్నాయి. విన్నవాళ్ళకే చాలా అసహ్యంగా ఉంది పిల్లల మాటలు. స్కూళ్ళకు వెళ్ళి చదువుకుని, ఆడుకోవాల్సిన పిల్లల బుర్రల్లోకి రాజకీయాలను అందులోనూ జగన్ అంటే విద్వేషాన్ని ఎక్కిస్తున్నాయి. దీనివల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేకపోగా మరింత నష్టం జరుగుతుందని గ్రహించటంలేదు.


First Published:  4 Oct 2023 6:29 AM GMT
Next Story