Telugu Global
Andhra Pradesh

42.. టీడీపీ 20 ఏళ్లుగా గెలవని అసెంబ్లీ స్థానాలు

తెలుగుదేశం పార్టీ దాదాపు 40కి పైగా నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆయా స్థానాల్లో తెలుగుదేశం కూటమిగా వచ్చినా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు.

42.. టీడీపీ 20 ఏళ్లుగా గెలవని అసెంబ్లీ స్థానాలు
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరిగింది. జగన్‌ సిద్ధం సభలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే దాదాపు 70 స్థానాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించాడు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉంది. చాలా నియోజకవర్గమైన బలమైన అభ్యర్థులు లేరు.

ఇక తెలుగుదేశం పార్టీ దాదాపు 40కి పైగా నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆయా స్థానాల్లో తెలుగుదేశం కూటమిగా వచ్చినా పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గత 20 ఏళ్లుగా ఖాతా తెరవని నియోజకవర్గాలు దాదాపు 42. ఆయా స్థానాల్లో వరుసగా 2004, 2009, 2014 , 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడుతూ వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ 42 స్థానాల్లో ఒకటి, రెండు స్థానాల్లో మధ్యలో వచ్చిన ఉపఎన్నికల్లో టీడీపీ విజయం సాధించినప్పటికీ.. ప్రధాన ఎన్నికల్లో 20 ఏళ్లుగా ఖాతా తెరవలేదు.

తెలుగుదేశం పార్టీ గత 20 ఏళ్లుగా ఖాతా తెరవని స్థానాలు ఇవే -

- కురుపాం

- బొబ్బిలి

- పాడేరు

- ప్రత్తిపాడు

- కొత్తపేట

- జగ్గంపేట

- రంపచోడవరం

- తాడేపల్లి గూడెం

- తిరువూరు

- పామర్రు

- విజయవాడ వెస్ట్‌

- మంగళగిరి

- బాపట్ల

- గుంటూరు ఈస్ట్

- నరసరావుపేట

- మాచర్ల

- యర్రగొండపాలెం

- సంతనూతలపాడు

- కందుకూరు

- గిద్దలూరు

- ఆత్మకూరు

- నెల్లూరు సిటీ

- నెల్లూరు రూరల్‌

- సర్వేపల్లి

- బద్వేలు

- కడప

- కోడూరు

- పులివెందుల

- జమ్మలమడుగు

- మైదుకూరు

- ఆళ్లగడ్డ

- నందికొట్కూరు

- కర్నూలు

- పాణ్యం

- నంద్యాల

- కొడుమూరు

- ఆలూరు

- పీలేరు

- చంద్రగిరి

- గంగధర నెల్లూరు

- పూతలపట్టు

First Published:  18 Feb 2024 1:47 PM GMT
Next Story