Telugu Global
Andhra Pradesh

సీఐడీతోపాటు ఏసీబీ కూడా.. ప్రమాణ స్వీకారానికి ముందే ఫిర్యాదులు

బొత్స తరహాలోనే మిగతా వారు కూడా విచారణ నుంచి తప్పించుకోలేరని టీడీపీ వార్నింగ్ ఇచ్చింది. గతంలో జరిగిన వ్యవహారాలన్నిటినీ తవ్వి తీస్తామంటున్నారు టీడీపీ నేతలు.

సీఐడీతోపాటు ఏసీబీ కూడా.. ప్రమాణ స్వీకారానికి ముందే ఫిర్యాదులు
X

టీడీపీ నేతలు పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. ఓ వైపు వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతూనే మరోవైపు మాజీ మంత్రులు, అధికారులపై కూడా కక్షసాధింపు చర్యలు మొదలు పెట్టారు. ఓ పద్ధతి ప్రకారం వారిపై అటాక్ చేస్తున్నారు. ముందు ఎల్లో మీడియా ద్వారా తప్పు జరిగినట్టు వార్తా కథనాలు వచ్చేలా చేస్తారు, ఆ తర్వాత టీడీపీ నుంచి కొంతమంది మరింత బురదజల్లుతారు, ఫైనల్ గా వైరివర్గంపై విచారణ సంస్థలకు ఫిర్యాదులు చేస్తారు. ఎన్నికల ముందు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. ఎన్నికల తర్వాత కూడా ఇలాగే వైసీపీ నేతల్ని ఇరుకున పెడుతున్నారు.

హిట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు బొత్స..

టీడీపీ హిట్ లిస్ట్ లో ఫస్ట్ వినిపిస్తున్న పేరు బొత్స సత్యనారాయణ. ఆయనపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు టీడీపీ నేత వర్ల రామయ్య. తమ కంప్లయింట్ తీసుకుని ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్ మెంట్ కూడా ఇచ్చారన్నారు. అవినీతి చేసిన మాజీ మంత్రులంతా ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు బొత్స.

బొత్స చేసిన తప్పేంటి..?

విద్యాశాఖ మంత్రిగా బొత్స ఉన్న సమయంలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. అయితే ఇవి సాధారణ బదిలీలు కావు, రికమండేషన్ పై జరిగిన బదిలీలు. ఈ రికమండేషన్ కోసం బొత్స సహా ఆయన పేషీలో పనిచేసిన అధికారులు డబ్బులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. ఒక్కొకరి వద్ద రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వసూలు చేశారని, మొత్తంగా ఇది 65 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పారు వర్ల రామయ్య. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా బదిలీలు చేశారని అంటున్నారు.

మిగతావారికి హెచ్చరికలు..

బొత్స తరహాలోనే మిగతా వారు కూడా విచారణ నుంచి తప్పించుకోలేరని టీడీపీ వార్నింగ్ ఇచ్చింది. గతంలో జరిగిన వ్యవహారాలన్నిటినీ తవ్వి తీస్తామంటున్నారు టీడీపీ నేతలు. అందరికీ శిక్ష పడేలా చేస్తామంటున్నారు. ఈ రాజకీయ ప్రతీకారాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.

First Published:  10 Jun 2024 2:47 PM GMT
Next Story