Telugu Global
Andhra Pradesh

సుప్రీంకోర్టు తీర్పు మీద వీళ్లు తీర్పులు ఇచ్చేస్తున్నారు

17ఏ సెక్షన్ మినహా మిగిలిన పాయింట్లలో ప్రతిదీ చంద్రబాబుకు వ్యతిరేకంగానే తీర్పొచ్చింది. దీన్నే ఎల్లోబ్యాచ్ అంటే టీడీపీ నేతలు+ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది.

సుప్రీంకోర్టు తీర్పు మీద వీళ్లు తీర్పులు ఇచ్చేస్తున్నారు
X

సుప్రీం కోర్టులోని ద్విసభ్య ధర్మాసనం 17ఏ సెక్షన్‌పై ఇచ్చిన తీర్పును ఎల్లోబ్యాచ్ తట్టుకోలేకపోతోంది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టుపై జడ్జీల్లో అనిరుధ్ బోస్ 17ఏ వర్తిస్తుందన్నారు. అంటే చంద్రబాబును అరెస్టు చేసేముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని తీర్పిచ్చారు. ఇదే సమయంలో మరో జడ్జి బేలాత్రివేది చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. 17ఏ సెక్షన్ కేవలం అమాయకులైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వేధింపులకు గురికాకుండా వారి రక్షణకు మాత్రమే ఏర్పాటు చేసిందన్నారు.

తీర్పులు భిన్నంగా ఉన్నా బోస్ కూడా ఏసీబీ జడ్జి చంద్రబాబుకు విధించిన రిమాండు కరెక్టే అన్నారు. రిమాండ్ విషయంలో తాను జోక్యం చేసుకోవటంలేదన్నారు. విచారణ జరుపుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్ పిటీషన్ను ఇద్దరు జడ్జీలు కలిసే క్వాష్ చేసేశారు. అంటే 17ఏ సెక్షన్ వర్తింపు పై అటు ఇటు కాకుండా తీర్పొచ్చినా కేసు నమోదుచేయటం, అరెస్టు, రిమాండులో చంద్రబాబుకు ఊరటదక్కలేదు. పైగా చంద్రబాబుపై కేసు పెట్టి అరెస్టు చేయటంలో ఎలాంటి రాజకీయ కక్షలు కనబడటంలేదని ఇద్దరు జడ్జీలు అభిప్రాయపడ్డారు.

17ఏ సెక్షన్ మినహా మిగిలిన పాయింట్లలో ప్రతిదీ చంద్రబాబుకు వ్యతిరేకంగానే తీర్పొచ్చింది. దీన్నే ఎల్లోబ్యాచ్ అంటే టీడీపీ నేతలు+ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. 17ఏ సెక్షన్ పై అనిరుధ్ బోస్ ఇచ్చిన తీర్పును మాత్రమే హైలైట్ చేసుకుంటోంది. 17ఏ సెక్షన్ పై బోస్ తీర్పును పట్టుకుని మిగిలిన పాయింట్లను వదిలేసి అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. చంద్రబాబు మీద కేసు నమోదుచేయటం, రిమాండు విధించటాన్ని బోస్ తప్పుపట్టారంటు నానా రచ్చచేస్తోంది.

పైగా బోస్ తీర్పుమీద బహిరంగ చర్చకు రావాలంటూ పదేపదే కవ్విస్తున్నారు రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్ర. ద్విసభ్య ధర్మాసనం తీర్పులో బేలా త్రివేది వ్యాఖ్యలను ఎల్లోబ్యాచ్ అసలు పట్టించుకోవటంలేదు. వైసీపీ, టీడీపీకి సంబంధంలేని న్యాయనిపుణులు, విశ్లేషకులు సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు ఎదురుదెబ్బగానే వర్ణిస్తున్నారు. దాంతో ఎల్లోబ్యాచ్ లో అసహనం మరింతగా పెరిగిపోతోంది. దీనికి మించిన మరో కారణం ఏమిటంటే.. చంద్రబాబు అరెస్టు జరుగుతుందేమో అనే భయం ఎల్లోబ్యాచ్ లో పెరిగిపోతోంది. అందుకనే తీర్పులను కూడా తనకు అనుకూలంగా వక్రీకరించుకుంటోంది.

First Published:  18 Jan 2024 5:46 AM GMT
Next Story