Telugu Global
Andhra Pradesh

''స్క్రాప్‌''ను ''కాపు'' చేసి.. కొడాలిపై టీడీపీ, జనసేన అటాక్

మహానాడులో ఎన్టీఆర్‌ వారసులు ఫొటోలు లేనప్పుడు అచ్చెన్నాయుడు లాంటి స్క్రాప్ నాకొడుకుల ఫొటో ఎందుకని తాను ప్రశ్నించానని.. దాన్ని వక్రీకరించి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు.

స్క్రాప్‌ను కాపు చేసి.. కొడాలిపై టీడీపీ, జనసేన అటాక్
X

టీడీపీ మినీ మేనిఫెస్టోపై రెండు రోజుల క్రితం కొడాలి నాని ప్రెస్‌ మీట్ పెట్టారు. అందులో పదేపదే టీడీపీ నేతలను ''స్క్రాప్‌ నాకొడుకులు'' అంటూ తిట్టారు. దీన్ని కొందరు వక్రీకరించారు. ''స్క్రాప్‌ నాకొడుకులు'' అని కొడాలి నాని అంటే టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు దాన్ని'' కాపు నాకొడుకులు'' అని కొడాలి నాని తిట్టారంటూ విపరీతంగా వైరల్ చేశారు.

జనసేన నేతలు కొడాలి నాని డీఎన్‌ఏ పరీక్షలకు రావాలని సవాల్ చేశారు. జనసేన మద్దతు దారులు ఏకంగా సోషల్ మీడియాలో వీడియోలు చేసి కొడాలి నానిని బూతులు తిట్టారు. ఈ దాడిపై కొడాలి నాని స్పందించారు. టీడీపీ కట్‌ అండ్ పేస్ట్ వీడియోలకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. టీడీపీ ఫేక్‌ వీడియోలపై జనసేన స్పందించడాన్ని ఆయన తప్పుపట్టారు.

మహానాడులో ఎన్టీఆర్‌ వారసులు ఫొటోలు లేనప్పుడు అచ్చెన్నాయుడు లాంటి స్క్రాప్ నాకొడుకుల ఫొటో ఎందుకని తాను ప్రశ్నించానని.. దాన్ని వక్రీకరించి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. కట్ అండ్ పేస్ట్ వీడియోలు చేస్తున్న టీడీపీని కట్‌ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ నీచమైన మాయలో పడవద్దని కాపులను కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. నిజానికి కొడాలి ప్రెస్‌మీట్ మొత్తం చూస్తే ఎక్కడా కాపుల గురించి ఆయన మాట్లాడలేదు. కేవలం టీడీపీ నేతలను స్క్రాప్‌ నాకొడుకులు అంటూ మాత్రం పదేపదే మాట్లాడారు. దాన్నే కొందరు వక్రీకరించి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

First Published:  31 May 2023 5:27 AM GMT
Next Story