Telugu Global
Andhra Pradesh

Taraka Ratna Health Update: తారకరత్న ఆరోగ్యం ఎలా ఉంది..? కల్యాణ్ రామ్ ఏమన్నారంటే..?

Taraka Ratna Health Update: కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు.

Taraka Ratna Health Update: తారకరత్న ఆరోగ్యం ఎలా ఉంది..? కల్యాణ్ రామ్ ఏమన్నారంటే..?
X

Taraka Ratna Health Update: తారకరత్న ఆరోగ్యం ఎలా ఉంది..? కల్యాణ్ రామ్ ఏమన్నారంటే..?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర తొలిరోజున అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తారకరత్న ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆయన ఆరోగ్యం గురించి మొదట్లో హడావిడి జరిగింది, హెల్త్ బులిటెన్లు విడుదలయ్యాయి. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వద్ద మీడియా కాపు కాసింది.


ఆస్పత్రికి వీఐపీల తాకిడి పెరిగింది. ఆ తర్వతా ఇప్పుడు సందడి లేదు. తారకరత్న కోలుకున్నారా లేదా అనేది కూడా బయటకు రాలేదు. ఈ సమయంలో నందమూరి కల్యాణ్ రామ్, తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు.

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. అంతకు మించి తానేమీ చెప్పలేనని, వైద్యులే అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందని అన్నారు.

తారకరత్న ప్రస్తుత పరిస్థితి ఏంటి..?

తారకరత్న ఆస్పత్రిలో ఉండగా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. బాలకృష్ణ స్వయంగా అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్.. ఇలా చాలామంది ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


పరిస్థితి పూర్తిగా కుదుటపడలేదనే వాస్తవం వారి మాటల్లోనే బయటపడింది. కానీ వైద్యులు వారి ప్రయత్నం చేస్తున్నారు. ఓదశలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను విదేశాలకు తరలిస్తారని కూడా అన్నారు. కానీ అదీ జరగలేదు. రోజులు గడుస్తున్నాయి.


తారకరత్న ఆస్పత్రిలో చేరి రెండు వారాలవుతోంది. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇస్తున్నా, ప్రస్తుతం తారకరత్న పరిస్థితి ఏంటనేది బయటకు రావడంలేదు. ఈ సమయంలో ఆయన కోలుకుంటున్నాడని కల్యాణ్ రామ్ చెప్పిన మాటే కాస్త ఊరటనిస్తోంది.

First Published:  10 Feb 2023 5:57 AM GMT
Next Story