Telugu Global
Andhra Pradesh

ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ : అన్‌స్టాపబుల్ షోకు పవన్

నందమూరి బాలకృష్ణ షోకు మెగా హీరోలు ఎవరైనా హాజరైతే బాగుంటుందని కొద్ది రోజులుగా ఫ్యాన్స్ కోరుతూ వచ్చారు. అల్లు అరవింద్ కూడా మెగాస్టార్ చిరంజీవిని ఈ షో కోసం రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది.

ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ : అన్‌స్టాపబుల్ షోకు పవన్
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అనే షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో ఈ షో కేవలం ఎంటర్‌టైన్మెంట్ ప్రధానంగా సాగగా ఈసారి మాత్రం పాలిటిక్స్ ని కూడా చొప్పించారు. ఈ సీజన్ మొదటి షోలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఆ తర్వాత మరో ఎపిసోడ్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

ఇప్పటికే ఆహా నిర్వాహకుడు అయిన అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ని కలవడం.. షోకు గెస్ట్ గా రావాలని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన షో షూటింగ్ కి హాజరయ్యే డేట్ మాత్రం ఫిక్స్ చేయాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణ షోకు మెగా హీరోలు ఎవరైనా హాజరైతే బాగుంటుందని కొద్ది రోజులుగా ఫ్యాన్స్ కోరుతూ వచ్చారు. అల్లు అరవింద్ కూడా మెగాస్టార్ చిరంజీవిని ఈ షో కోసం రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ అన్‌స్టాప‌బుల్ షోకు హాజరవుతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ హీరోలు కూడా ఒకరినొకరు కలవడం కూడా తక్కువే.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించింది చాలా తక్కువ. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో సుస్వాగతం సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ క్లాప్ కొట్టాడు. ఒకవైపు జనసేనతో పొత్తు కోసం టీడీపీ ఎదురుచూస్తుండగా.. టీడీపీ కీలక నాయకుడైన బాలకృష్ణ నిర్వహిస్తున్న షోకు పవన్ కళ్యాణ్ హాజరవుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ లను జంటగా ఆహ్వానించడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పుకునే దర్శకుడు త్రివిక్రమ్ ను ఈ షోకు ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది.

First Published:  16 Dec 2022 6:10 AM GMT
Next Story