Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసు హైదరాబాద్ కు బదిలీ - సుప్రీం కోర్టు ఆదేశాలు

వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 మార్చిలో కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య‌ కో-పిటిషనర్.

వివేకా హత్య కేసు హైదరాబాద్ కు బదిలీ - సుప్రీం కోర్టు ఆదేశాలు
X

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌ స్పెషల్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 మార్చిలో కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య‌ కో-పిటిషనర్.

"ప్రస్తుతం జరుగుతున్న విచారణపై పిటిషనర్ లైన‌ మరణించిన వారి కుమార్తె, భార్య సంతృప్తిగా లేకపోవడం వల్ల, వారి ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని ఈ కేసును బదిలీ చేయడమైనది'' అని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది

ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు, ఛార్జిషీట్ , అనుబంధ ఛార్జిషీట్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడతాయి. భారీ కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై విచారణను త్వరగా పూర్తి చేయాలని, ఆ విచారణ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.

First Published:  29 Nov 2022 6:11 AM GMT
Next Story