Telugu Global
Andhra Pradesh

‘పోలవరం’పై కేంద్రం విజ్ఞప్తికి సుప్రీంకోర్టు నో

పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

‘పోలవరం’పై కేంద్రం విజ్ఞప్తికి సుప్రీంకోర్టు నో
X

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు `నో` చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేంద్ర స్పందిస్తూ.. దీనిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా అందుకు తిరస్కరించింది. ఏపీ హైకోర్టుకే వెళ్లాలని సూచిస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సోమవారం కొట్టేసింది.

First Published:  11 Dec 2023 1:06 PM GMT
Next Story