Telugu Global
Andhra Pradesh

రఘురామ కుమారుడి విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

తన తండ్రిని రాష్ట్ర ప్రభుత్వమే చిత్రహింసలకు గురి చేసిందన్నారు. కాబట్టి టార్చర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అందుకు స్పందించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి ప్రభుత్వ వివరణ కూడా తెలుసుకుంటామని చెప్పింది.

రఘురామ కుమారుడి విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
X

తన తండ్రిని సీఐడీ పోలీసులు కస్టడీలో టార్చర్‌ పెట్టారంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాల‌ని పిటిషనర్, ఎంపీ ర‌ఘురామ కుమారుడు భరత్ సుప్రీంకోర్టును కోరారు.

తన తండ్రిని కస్డడీలో చిత్రహింసలు పెట్టారని, రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గంలో కూడా తన తండ్రి పర్యటించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని భరత్ కోర్టులో ఆరోపించారు. అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చిన సమయంలో చెక్‌పోస్టులు పెట్టి మరీ తన తండ్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని వివరించారు.

తన తండ్రిని రాష్ట్ర ప్రభుత్వమే చిత్రహింసలకు గురి చేసిందన్నారు. కాబట్టి టార్చర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అందుకు స్పందించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి ప్రభుత్వ వివరణ కూడా తెలుసుకుంటామని చెప్పింది. అందుకు ఎంపీ కుమారుడు భరత్‌ తరపు న్యాయవాది.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చవద్దని కోరారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించే విషయంలో ఏపీ ప్రభుత్వ వాదన తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చకుండా నేరుగా కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలివ్వాలన్నారు. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఏపీ ప్రభుత్వ వాదన విన్న తర్వాతనే.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ ఎంపీ కుమారుడి విజ్ఞప్తిని దేశ‌ అత్యున్న‌త ధ‌ర్మాస‌నం తోసి పుచ్చింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

First Published:  7 Sep 2022 11:20 AM GMT
Next Story