Telugu Global
Andhra Pradesh

సునీతకు రివర్స్ కొట్టడం ఖాయమేనా?

సుప్రీంకోర్టు స్పందన చూస్తుంటే సునీత ఓవర్ యాక్షన్ చేస్తున్నదని అభిప్రాయపడుతున్నట్లే ఉంది. దస్తగిరి బెయిల్ రద్దయి జైలుకు వెళితే సునీతకు వచ్చిన నష్టమేంటో అర్థంకావటంలేదు.

సునీతకు రివర్స్ కొట్టడం ఖాయమేనా?
X

సునీతకు రివర్స్ కొట్టడం ఖాయమేనా?

వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూతురు సునీతారెడ్డి చేస్తున్న ఓవర్ యాక్షన్ చివరకు ఆమెకు రివర్సుకొట్టే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. వివేకా హతంకుల్లో కీలకమైన దస్తగిరి బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే కేసు ఈనెల 9వ తేదీకి వాయిదా ప‌డింది. విచారణ సందర్భంగా జడ్జీలు కృష్ణమురారి, సంజీవ్ కుమార్ ధర్మాసనం బాగా చిరాకుపడినట్లు తెలుస్తోంది. కేసులో బాధితులు ఎవరు? నిందితులు ఎవరు? అసలు హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు కేసును ఎందుకు విచారించాలనే ప్రశ్నలను లేవనెత్తారు.

దస్తగిరి బెయిల్ రద్దు చేయాలన్న వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటీషన్‌లో సునీత కూడా ఇంప్లీడ్ అయ్యారు. కృష్ణారెడ్డి తన పిటీషన్‌లో వివేకాను చంపిందే దస్తగిరి అయితే నిందితుడు అవుతాడు కానీ బాధితుడు ఎలాగవుతాడని ప్రశ్నించారు. సాక్షిగా ఉన్న తాను చివరకు బాధితుడిని అయ్యానన్నారు. కాబట్టి తనను బాధితుడిగా గుర్తించాలని కోరారు. వెంటనే సునీత జోక్యం చేసుకుని కేసులో తానే బాధితురాలినని, కాబట్టి తన వాదనలు కూడా వినాలని పట్టుబట్టారు.

దాంతో ధర్మాసనం ఏ హోదాలో ఇంప్లీడ్ అవుతున్నారని సునీతను ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన ఏ పిటీషన్‌లో అయినా తాను ఇంప్లీడ్ అవుతానని, తనను బాధితురాలిగా చూడాలని కోరారు. ప్రతి పిటీషన్‌లో ఇంప్లీడ్‌ అవ్వాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం నిలదీసింది. ఇప్పటికే అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరెడ్డి, తులశమ్మ, కృష్ణారెడ్డి వేసిన ప్రతి పిటీషన్‌లోనూ సునీత ఇంప్లీడయ్యారు. దాంతో ధర్మాసనానికి చికాకొచ్చినట్లుంది.

వీళ్ళ వాదనలు విన్నతర్వాత అసలు ఈ కేసును సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు విచారించటమే సబబు అని అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటీషన్లను ముందు అక్కడే తేల్చుకోవాలని చెప్పింది. ఈ కేసులో నిందుతులెవరు, బాధితులులెవరనే విషయంపై తొందరలోనే నిర్ణయిస్తామన్నది. సునీత బాధితురాలా? లేకపోతే ఫిర్యాదుదారా అన్నది కూడా తేల్చేస్తామని ధర్మాసనం చెప్పింది. సుప్రీంకోర్టు స్పందన చూస్తుంటే సునీత ఓవర్ యాక్షన్ చేస్తున్నదని అభిప్రాయపడుతున్నట్లే ఉంది. దస్తగిరి బెయిల్ రద్దయి జైలుకు వెళితే సునీతకు వచ్చిన నష్టమేంటో అర్థంకావటంలేదు. ఇదే విషయం జడ్జీలను కూడా ఆశ్చర్యపరిచి ఉంటుంది.

First Published:  4 July 2023 6:12 AM GMT
Next Story