Telugu Global
Andhra Pradesh

విజయవాడ బరిలో సుజనా.. చిన్నికి వెన్నుపోటేనా?

విజయవాడలో కేశినేని నాని బలమైన నేత. క్షేత్రస్థాయిలో ఆయనకు మంచి పట్టు ఉంది. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆయనను ఓడించడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సవాల్ లాంటిదే. ఇందుకోసమే చంద్రబాబు ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న సుజనాను తెరపైకి తీసుకొచ్చారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

విజయవాడ బరిలో సుజనా.. చిన్నికి వెన్నుపోటేనా?
X

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీకి జై కొట్టిన విషయం తెలిసిందే. నాని స్థానంలో కేశినేని చిన్నికి టీడీపీ తరపున పార్లమెంట్ సీటు ఇస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. విజయవాడ నుంచి తాను బరిలో ఉంటానని ఆయ‌న తాజాగా స్పష్టం చేశారు .

సుజనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి. సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ..చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరుంది. చంద్రబాబే దగ్గరుండి సుజనా చౌదరి లాంటి వారిని కాషాయం గూటికి చేర్చారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ బీజేపీలో చేరినప్పటికీ చంద్రబాబుతో సుజనా చౌదరి సన్నిహితంగానే ఉన్నారు. బీజేపీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం సభ్యులలాగే వ్యవహరించారు. ఇక సుజనా చౌదరి విజయవాడ నుంచి పోటీ చేస్తాననడం ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. చంద్రబాబుకు తెలియకుండా సుజనా ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదు.

విజయవాడలో కేశినేని నాని బలమైన నేత. క్షేత్రస్థాయిలో ఆయనకు మంచి పట్టు ఉంది. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆయనను ఓడించడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సవాల్ లాంటిదే. ఇందుకోసమే చంద్రబాబు ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న సుజనాను తెరపైకి తీసుకొచ్చారా అనే అనుమానాలు మొదలయ్యాయి. బీజేపీ నుంచి ఆయనను, తెలుగుదేశం నుంచి చిన్నిని పోటీ చేయిస్తారా లేదా బీజేపీతో పొత్తు ఖరారైతే చివరి నిమిషంలో చిన్నికి హ్యాండ్ ఇచ్చి సుజనాకు టికెట్ ఇచ్చేస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

First Published:  12 Jan 2024 4:34 PM GMT
Next Story