Telugu Global
Andhra Pradesh

బొట్టు, గోరింటాకు.. ఏపీలో ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్యాయత్నం

తనపై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆమె మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోసారి విద్యార్థినులను బెదిరించారట. దీంతో ఓ విద్యార్థిని మళ్లీ ఆత్మహత్యకు ప్రయత్నించింది.

బొట్టు, గోరింటాకు.. ఏపీలో ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్యాయత్నం
X

బొట్టు, గోరింటాకు పెట్టుకున్నందుకు తమను వార్డెన్ వేధిస్తున్నారంటూ హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. వార్డెన్ ని మందలించినా ఫలితం లేకపోయింది. మరోసారి వార్డెన్ వారితో కఠినంగా ప్రవర్తించడంతో రెండోసారి వారిలో ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటంతో.. అసలు హాస్టల్ లోని విద్యార్థినులందరికీ ఉన్నతాధికారులు సెలవలు ఇచ్చేశారు.

కర్నూలు DMHO ఆఫీస్ ప్రాంగణంలో ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఉంది. అందులో 30 మంది విద్యార్థినులు మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ గా శిక్షణ తీసుకుంటున్నారు. వారికి అక్కడే హాస్టల్ కూడా ఉంటుంది. శిక్షణ, హాస్టల్ వ్యవహారాలన్నీ.. ప్రిన్సిపల్‌ కమ్ వార్డెన్‌ గా ఉన్న విజయ సుశీల చూసుకుంటారు. అయితే ఆమె విద్యార్థినుల విషయంలో కఠిన నిబంధనలు పెట్టారని సమాచారం. బొట్టు, గోరింటాకు పెట్టుకున్నా జరిమానా వేస్తుందని చెబుతున్నారు విద్యార్థినులు. వ్యక్తిగత సేవలన్నీ చేయించుకుంటుందని, మాట వినకపోతే కోర్సులో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఆమె వేధింపులు తట్టుకోలేక ఇటీవల హాస్టల్ లో ఇద్దరు యువతులు ఫ్యాన్‌ కు ఉరేసుకునేందుకు ప్రయత్నించారు. వారిని కాపాడిన మిగతా విద్యార్థులు.. ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌ లక్ష్మీనర్సయ్యకు ఫిర్యాదు చేశారు.

అయినా మారలేదు..

వార్డెన్ విజయ సుశీలను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ మందలించారు. హాస్టల్ లో ఉండొద్దని, వేరే ఇంటిలో ఉండాలని సూచించారు. తనపై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆమె మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోసారి విద్యార్థినులను బెదిరించారట. దీంతో ఓ విద్యార్థిని మళ్లీ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇక పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అధికారులు అందరికీ సెలవలు ఇచ్చేసి ఇంటికి పంపించేశారు.

First Published:  1 Feb 2023 1:20 AM GMT
Next Story