Telugu Global
Andhra Pradesh

సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఎడమ కన్నుకు గాయం

ఈ దాడిలో ఓ రాయి జగన్‌ ఎడమవైపు కనుబొమ్మకు తాకి రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు జగన్‌కు ఫస్ట్ ఎయిడ్ చేశారు.

సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఎడమ కన్నుకు గాయం
X

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై రాళ్లతో దాడి జరిగింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో ప్రజలకు అభివాదం చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు జగన్‌పైకి రాళ్లు రువ్వారు.

ఈ దాడిలో ఓ రాయి జగన్‌ ఎడమవైపు కనుబొమ్మకు తాకి రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు జగన్‌కు ఫస్ట్ ఎయిడ్ చేశారు. సీఎం జగన్‌పై క్యాట్‌బాల్‌తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

జగన్‌పై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు చేపిస్తున్నారని మండిపడుతున్నారు.

First Published:  13 April 2024 4:48 PM GMT
Next Story