Telugu Global
Andhra Pradesh

నువ్వు కమెడియన్.. కాదు నువ్వే.. వర్మ, నాగబాబు సోషల్ మీడియా వార్

వర్మ తల నరికితే రూ.కోటి ఇస్తానని కొలికపూడి వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పని, ఈ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో వర్మపై కూడా నాగబాబు సెటైర్లు వేశారు.

నువ్వు కమెడియన్.. కాదు నువ్వే.. వర్మ, నాగబాబు సోషల్ మీడియా వార్
X

సోషల్ మీడియా వేదికగా సినీ నటుడు నాగబాబు, దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య తరచూ వార్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి వారి మధ్య డిజిట‌ల్‌ ఘ‌ర్ష‌ణ‌ మొదలైంది. ఇటీవల ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాంగోపాల్ వర్మ ఏపీ డీజీపీని కలసి ఫిర్యాదు చేశారు.

తన ప్రాణానికి ఆపద ఉన్నట్లు డీజీపీ దృష్టికి తెచ్చారు. తన హత్యకు ఓ టీడీపీ నేత టీవీ లైవ్‌లోనే కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదని విమర్శించారు. దీనిపై తాజాగా సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందించారు. వర్మ తల నరికితే రూ.కోటి ఇస్తానని కొలికపూడి వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పని, ఈ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో వర్మపై కూడా నాగబాబు సెటైర్లు వేశారు.

'ఆర్జీవీ గారు మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ డోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. దేశంలో ఏ పనికిమాలిన వెధవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ ను ఎవడూ చంపడు. మీరేం బాధపడకండి. నిశ్చింతంగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి' అని నాగబాబు సెటైర్లు వేశారు.


నాగబాబు కామెంట్స్ కు రాంగోపాల్ వర్మ కూడా ఘాటుగా స్పందించారు. ' సార్, నాకంటే పెద్ద కమెడియన్ ఎవరంటే, నా సినిమాలో మీరు ' అంటూ వర్మ పంచ్ వేశారు. తాను తీస్తున్న వ్యూహం సినిమాలో నాగబాబు పాత్ర ఉందని.. అందులో అతడు మంచి కామెడీ చేశాడని వర్మ చెప్పుకొచ్చారు. తన గురించి ఎక్కువగా ఆలోచించవద్దని.. తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బు అడుక్కొని టీ తాగి పడుకోవాలని నాగబాబుకు వర్మ సూచించారు. వర్మ, నాగబాబు మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వార్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

First Published:  28 Dec 2023 6:03 AM GMT
Next Story