Telugu Global
Andhra Pradesh

హరికృష్ణ వర్థంతి ట్వీట్లు.. చంద్రబాబుకి పాట్లు

గతంలో హరికృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారాయి.

హరికృష్ణ వర్థంతి ట్వీట్లు.. చంద్రబాబుకి పాట్లు
X

ఎన్టీఆర్ జయంతి అయినా, వర్థంతి అయినా.. టీడీపీలో ఆ సందడే వేరు. అదే సమయంలో చంద్రబాబుకి మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. సోషల్ మీడియాలో చంద్రబాబుని ఏకిపారేస్తుంటారు నెటిజన్లు. ఆ పెద్దాయన పెట్టిన పార్టీ ఇప్పుడిలా తయారైందని, చంద్రబాబు చేతిలో సర్వనాశనం తప్పదని సెటైర్లు వేస్తుంటారు. ఇక వర్థంతి రోజయితే.. ఆయన మరణానికి చంద్రబాబే పరోక్ష కారణం అంటూ వరుస ట్వీట్లు పడుతుంటాయి. ఇప్పుడు హరికృష్ణ వర్థంతి రోజు కూడా చంద్రబాబుకి పెద్ద చిక్కొచ్చి పడింది. హరికృష్ణ చివరి రోజుల్లో చంద్రబాబుతో సఖ్యతగా లేరు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హరికృష్ణ రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత బాబు ఆయన్ని పూర్తిగా పక్కనపెట్టారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. ఒక రకంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆ పాత విషయాలన్నీ తవ్వి తీసి చంద్రబాబుని చికాకు పెడుతోంది.

బాబుపై హరికృష్ణ పంచ్ డైలాగులు..

ఎన్టీఆర్ వర్థంతి రోజు.. ఆయన గతంలో చంద్రబాబు గురించిన మాటల్ని మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు. ఇప్పుడు హరికృష్ణ వర్థంతి రోజు కూడా అలాంటి వీడియోలు బయటకు వస్తున్నాయి. గతంలో హరికృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారాయి.

మింగలేక, కక్కలేక..

హరికృష్ణ వర్థంతి సందర్భంగా ముందుగానే చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు వేశారు. కానీ వాటికి నెగెటివ్ కామెంట్లు రావడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందులోనూ ఇటీవలే చంద్రబాబుని కాదని ఎన్టీఆర్‌ని అమిత్ షా కలిశారు. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే అనుకున్నా ఇప్పుడు హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు ఎన్టీఆర్ ప్రస్తావన కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. టీడీపీ పగ్గాలు హరికృష్ణ వారసుడిగా ఎన్టీఆర్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తమ్మీద హరికృష్ణ వర్థంతి.. చంద్రబాబుకి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టింది.

First Published:  29 Aug 2022 6:31 AM GMT
Next Story