Telugu Global
Andhra Pradesh

సీఎం జగన్ ట్వీట్ పై సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం.. క్లాస్ పీకిన నెటిజన్లు

జగన్ చేసిన ట్వీట్ కు ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు రావడం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే గర్వకారణం కాదని, దేశానికే గర్వ కారణమని అద్నాన్ సమీ పేర్కొన్నాడు.

సీఎం జగన్ ట్వీట్ పై సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం.. క్లాస్ పీకిన నెటిజన్లు
X

రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని `నాటు నాటు` పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందాన్ని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా రాజమౌళి బృందాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ''నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం హర్షణీయం. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడించారు. మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకొనే తెలుగు పాట పట్ల గర్వపడుతున్నా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది తెలుగు ప్రజలను, భారతీయులందరికీ గర్వకారణం చేసినందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

అయితే జగన్ చేసిన ట్వీట్ కు ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు రావడం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే గర్వకారణం కాదని, దేశానికే గర్వ కారణమని అద్నాన్ సమీ పేర్కొన్నాడు. సీఎం జగన్ ప్రాంతీయ విభజనలను సృష్టించినందుకు, దేశీయంగా ఈ ఆత్మగౌరవాన్ని తీసుకోలేనందుకు సిగ్గు పడుతున్నా.. అని అద్నాన్ సమీ ట్విట్టర్ వేదికగా ఘాటు కామెంట్స్ చేశారు.

అయితే అద్నాన్ సమీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ పై అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తెలుగు ప్రజలు వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా అద్నాన్ సమీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్ వచ్చింది తెలుగు సినిమాలోని ఒక పాటకి.. ఆ పాటను తెలుగు వాళ్లే రాశారు.. వాళ్లే పాడారు..వాళ్లే సంగీతం అందించారు.. అందుకే వారికే అభినందనలు దక్కుతున్నాయి.. మధ్యలో నీ సమస్య ఏంటి? అని పలువురు నెటిజన్లు అద్నాన్ సమీని ప్రశ్నించారు.


బాలీవుడ్ సినిమాకు ఏదైనా అవార్డు వస్తే ఇది మా బాలీవుడ్ కు వచ్చిన అవార్డు అని గొప్పగా చెప్పుకుంటారు.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి అవార్డు వస్తే అది దేశం మొత్తానికి వచ్చిన అవార్డుగా చెప్పుకుంటారు.. ఇదెక్కడి న్యాయమని మరికొందరు అద్నాన్ సమీని నిలదీశారు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అవార్డుపై ముఖ్యమంత్రి జగన్ గర్వపడుతున్నారని అందులో తప్పులు వెతకొద్దని పలువురు నెటిజన్లు అద్నాన్ సమీకి హితవు పలికారు. అద్నాన్ సమీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సమయంలో చిత్ర బృందాన్ని అభినందిస్తూ జగన్ ట్వీట్ చేయగా..ఆ పోస్ట్ ని వ్యతిరేకిస్తూ ఇటువంటి కామెంట్సే చేశాడు.

First Published:  14 March 2023 7:53 AM GMT
Next Story